ఫ్యాక్ట్ చెక్: ఆ జంటకు 15 మంది పిల్లలా..?

భారతదేశంలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మతపరమైన కోణంతో.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Update: 2022-05-07 09:47 GMT

క్లెయిమ్: భారత్ లోని ఆ ముస్లిం జంటకు ఏకంగా 15 మంది పిల్లలు

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

పాకిస్థాన్ నుండి వచ్చిన ఒక మహిళా రిపోర్టర్.. ముస్లిం దంపతులకు ఎంత మంది పిల్లలు అని అడుగుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. తమకు 15 మంది పిల్లలు ఉన్నారని భర్త చెప్పడం గమనించవచ్చు. భారతదేశంలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మతపరమైన కోణంతో.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలో, యాంకర్ ఆ జంటతో మీకు ఎంత మంది పిల్లలు అని అడగడం గమనించవచ్చు. చుట్టూ తిరుగుతున్న పిల్లలను చూపించి.. తమకు 15 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. ఈ క్లిప్‌ను పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు షేర్ చేస్తున్నారు. ఓ వర్గాన్ని విమర్శిస్తూ రాబోయే రోజుల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతాయని హెచ్చరిస్తున్నారు సోషల్ మీడియాలో..!
Full View
ఇది భారతదేశంలో తీసిన వీడియో అని కొందరు ప్రచారం చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ వీడియోను చూడగా ఆ వీడియోలో 'Leader TV HD' అనే లోగో కింద భాగంలో చూడవచ్చు. దీన్ని హింట్ గా తీసుకుని సెర్చ్ చేయగా.. అదే పేరుతో ఫేస్ బుక్ లో ఒక వీడియోను అప్లోడ్ చేసి ఉండడాన్ని గమనించవచ్చు. ఏప్రిల్ 11, 2022న వీడియోను పోస్టు చేశారు.

వీడియోతో పాటు క్యాప్షన్ ఉర్దూలో పోస్ట్ చేయబడింది. "మురికివాడల్లో నివసించే వారికి ఎక్కువ మంది పిల్లలు ఎందుకు ఉన్నారు?...." అని దానర్థం.
Full View

'Leader TV Hd' అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయడం గమనించవచ్చు. ఆ ఛానల్ కు వెబ్సైటు కూడా ఉంది. '
www.leader.com.pk
' అనే వెబ్సైట్ ను మనం చూడవచ్చు. '.pk' డొమైన్ ఉన్నవి చాలా వరకూ పాకిస్థానీ వెబ్సైట్స్ అని స్పష్టంగా మనకు తెలిసిపోతుంది.

యూట్యూబ్ ఛానల్ లోని 'about' సెక్షన్ లో చూడగా.. ఆ ఛానల్ పాకిస్థాన్ కు చెందిన లొకేషన్ అని తెలుస్తోంది. దీని ద్వారా ఆ యూట్యూబ్ ఛానల్ పాకిస్థాన్ కు చెందినదని అర్థమవుతోంది.

అదనంగా, మేము వీడియోలో ఉన్న యాంకర్ 'అనీ ఫైసల్' ఫేస్‌బుక్ ఖాతాను కూడా తనిఖీ చేసాము. ఆమె పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన జర్నలిస్టు అని తెలుస్తోంది.
కాబట్టి వైరల్ వీడియో భారత్ కు చెందినది కాదు.. పాకిస్థాన్ కు చెందినది.

క్లెయిమ్: ఆ జంటకు 15 మంది పిల్లలా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Video from India shows a Muslim man saying that he has 15 children
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News