ఫ్యాక్ట్ చెక్: ఏపి ప్రభుత్వం కొత్త వక్ఫ్ బోర్డును తీసుకురావడం కోసం పాత బోర్డును రద్దు చేసింది
శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులను నియంత్రించే దశాబ్దాల నాటి చట్టాన్ని సవరించాలని కేంద్ర
By - Satya Priya BNUpdate: 2024-12-03 05:34 GMT
శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులను నియంత్రించే దశాబ్దాల నాటి చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత వక్ఫ్ బిల్లుకు 40కి పైగా సవరణలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. వక్ఫ్ బిల్లు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది, ఇవి సాధారణంగా ఇస్లామిక్ చట్టం ప్రకారం ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం అంకితం చేసినవి. ఈ ఆస్తులు భారతదేశంలోని రాష్ట్ర, జాతీయ వక్ఫ్ బోర్డుల ద్వారా చూసుకుంటారు. వీటిని విద్య, సామాజిక సంక్షేమం, మతపరమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. నిర్వహణ లోపం, పారదర్శకత లేకపోవడంతో సంస్కరణల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లును సమీక్షించాల్సిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.. పలు అంతరాయాల కారణంగా బిల్లు ప్రవేశం వాయిదా పడింది. ఫిబ్రవరి 2025లో బడ్జెట్ సెషన్‌లో దీనిని సమర్పించాలని భావిస్తున్నారు.
ఈ వివాదం మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వక్ఫ్ బోర్డును రద్దు చేసిందనే వార్త వైరల్ అవుతోంది, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసింది ~ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయలేవు. బెంచ్‌మార్క్ సెట్ చేశారు. మాటల మనిషి కాదు చేతల మనిషి అని పవన్ కళ్యాణ్ గారు CBN నాయకత్వంలో చేసారు” అంటూ పోస్టులు పెట్టారు. టైమ్స్ నౌ టీవీ ఛానెల్ ప్రచురించిన వార్తల క్లిప్‌ను వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
కొంతమంది వినియోగదారులు “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది” వంటి క్యాప్షన్‌లతో పంచుకున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కూటమి ప్రభుత్వం కొత్త రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తోంది, దానిని రద్దు చేయలేదు.
మేము సంబంధిత కీ వర్డ్స్ తో సెర్చ్ చేసినప్పుడు, మార్చి 2023 నుండి ప్రస్తుత రాష్ట్ర వక్ఫ్ బోర్డు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని,
కానీ బోర్డ్ వ్యవహారాలు సరిగ్గ జరగలేదనీ తెలిసింది. సున్నీ, షియా పెద్దల నుండి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, మాజీ ఎంపీలను బోర్డులో చేర్చకపోవడం,
మరి ఇతర కారణాల
వల్ల పాత బోర్డును రద్దు చేశారు.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డును గత ప్రభుత్వం అక్టోబర్ 2023లో 11 మంది సభ్యులతో ఏర్పాటు చేసింది. అక్టోబరు 21, 2023 నాటి
G.O.Ms No47 యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తూ వచ్చిన ఆరోపణలు పరిశీలించి, వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వక్ఫ్ బోర్డు శాశ్వతంగా రద్దు చేశారన్న వాదనలను ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్‌చెక్ డివిజన్ కొట్టివేసింది. ఆ పోస్ట్‌లో “ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు మార్చి 2023 నుండి పని చేయడం లేదు. అనేక ముఖ్యమైన
సమస్యల కారణంగా G.O. Ms. నం. 47 ఉపసంహరణ తప్పనిసరి అయింది. దాని చెల్లుబాటును సవాలు చేస్తూ 13 రిట్ పిటిషన్లు, సున్నీ, షియా మత పెద్దలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, మాజీ ఎంపీలను చేర్చకపోవడం, పారదర్శక ప్రమాణాలు లేకుండా జూనియర్ న్యాయవాదుల నియామకం, నిర్దిష్ట సభ్యుల అర్హతకు సంబంధించిన ప్రశ్నలు, ఈ లోపాలను పరిష్కరించడానికి GoAP తగిన చర్యలు తీసుకుంటుంది. వీలైనంత త్వరగా కొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తుంది." అని వివరించారు.
అందువల్ల, వక్ఫ్ బోర్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది, లోపాలను పరిష్కరించిన తర్వాత పునరుద్ధరించనున్నారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసింది.
Claimed By : Twitter users
Fact Check : Misleading