నిజ నిర్ధారణ: పతంజలి, రామ్‌దేవ్ పేర్లతో బీఫ్ బిర్యానీ మసాలా అంటూ షేర్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేసింది
రామ్‌దేవ్, పతంజలి పేర్లతో కూడిన బీఫ్ బిర్యానీ మసాలా చిత్రం బాబా రామ్‌దేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద్ విక్రయిస్తోందన్న వాదనతో వైరల్ అవుతోంది.
రామ్‌దేవ్, పతంజలి పేర్లతో కూడిన బీఫ్ బిర్యానీ మసాలా చిత్రం బాబా రామ్‌దేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద్ విక్రయిస్తోందన్న వాదనతో వైరల్ అవుతోంది.
కొంతమంది వినియోగదారులు దీనిని "జాతీయ వ్యతిరేక పతంజలి" అనే శీర్షికతో షేర్ చేశారు, మరికొందరు హిందీలో క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేసారు: ""हिन्दुओ अभी भी सम्भल जाओ ये व्यपार कर रहे है"," దీనిని అనువదించగా "హిందువులు ఇక మేలుకోవాలి, వీరు కేవలం వ్యాపారం చేస్తున్నారు" అని అర్థం అవుతోంది.
నిజ నిర్ధారణ:
పతంజలి ఆయుర్వేద్ వారు బీఫ్ బిర్యానీ మిక్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారన్న వాదన అవాస్తవం. చిత్రం మార్ఫ్ చేసి పేరును మార్చారు.
పతంజలి ఉత్పత్తుల వెబ్‌సైట్‌లో బీఫ్ బిర్యానీ మసాలాల కోసం వెతికినప్పుడు, మాకు ఆన్‌లైన్‌లో అలాంటి ఉత్పత్తి ఏదీ కనబడలేదు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను ఉపయోగించి చిత్రం కోసం శోధించినప్పుడు, నేషనల్ ఫుడ్స్ ద్వారా ఉత్పత్తి అవుతున్న బీఫ్ బిర్యానీ మసాలా మిక్స్ చిత్రాన్ని కనుగొన్నాము. ఈ మసాలా మిక్స్ అమెజాన్ వంటి వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.
https://www.amazon.com/
https://www.get-grocery.com/
నేషనల్ ఫుడ్స్ -nfoodstore వెబ్‌సైట్‌లో కూడా ఉత్పత్తి లభించింది.
చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, 'నేషనల్' అనే పదాన్ని తీసివేసి పతంజలి ఆయుర్వేద, రామ్‌దేవ్ యొక్క లోగో ను జోడించారని తెలుస్తోంది. మిగిలినదంతా ఒకేలా ఉండడం గమనించవచ్చు.
అందువల్ల, పతంజలి ఆయుర్వేద బీఫ్ బిర్యానీ మసాలా మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తుందనే వాదన అబద్దం. నేషనల్ ఫుడ్స్‌కు చెందిన బీఫ్ బిర్యానీ మసాలా మిశ్రమానికి సంబంధించిన మార్ఫ్ చేసిన ఫోటో తప్పుడు దావాతో షేర్ అవుతోంది.