ఫ్యాక్ట్ చెక్: టీడీపీ కొత్త ప్రభుత్వం ఏపీలోని వాలంటీర్ వ్యవస్థలో మార్పును తీసుకుని వచ్చిందన్న వాదన అవాస్తవం

వాలంటీర్ వ్యవస్థను 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. పింఛన్లు, ఇతర పథకాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసే బాధ్యతలు ఇచ్చారు. 50 కుటుంబాలను పర్యవేక్షించడానికి ఒక వాలంటీర్ ను తీసుకుని వచ్చారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి

Update: 2024-06-08 11:15 GMT

Volunteer

వాలంటీర్ వ్యవస్థను 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. పింఛన్లు, ఇతర పథకాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసే బాధ్యతలు ఇచ్చారు. 50 కుటుంబాలను పర్యవేక్షించడానికి ఒక వాలంటీర్ ను తీసుకుని వచ్చారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సిపి తన రాజకీయ ప్రయోజనం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుందని ఆరోపించింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన తర్వాత గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
“*వాలంటరీ వ్యవస్థలో మార్పులు* *ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు* * ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు * కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం * డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుండి 2003 వరకు వయసు వయోపరిమితి * గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులుకు హాజరు అవ్వవలెను * వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం * ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి * ప్రతి నెల ఇచ్చే పెన్షన్ దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడును * సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించడం జరుగును. #TDP" అంటూ పోస్టులు పెట్టారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థలో మార్పుల గురించి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వార్త గురించి.. అన్ని ప్రధాన స్రవంతి మీడియా వెబ్‌సైట్‌లలో వెతికాం. ఆంధ్రప్రదేశ్ వాలంటరీ వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి మాకు ఎటువంటి నివేదికలు కనిపించలేదు.
అయితే ఈ వైరల్ పోస్టులను తప్పంటూ కొన్ని నివేదికలను కూడా మేము కనుగొన్నాము. దిశ దినపత్రిక ప్రకారం, వాలంటీర్ వ్యవస్థలో భాగమైన ఉన్నతాధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు. దీనిపై తమ వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని సూచించారు.
వే2న్యూస్ కూడా వైరల్ పోస్టులను ఖండిస్తూ వార్తను ప్రచురించింది. కాబట్టి, వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పులను చేస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. అలాంటి ప్రకటనేమీ ప్రభుత్వం నుండి రాలేదు.
Claim :  ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వం రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేస్తోంది
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News