ఫ్యాక్ట్ చెక్: ఆస్ట్రేలియా తరపున డబుల్ సెంచరీ కొట్టింది కేవలం గ్లెన్ మ్యాక్స్ వెల్ మాత్రమే కాదు. అతడి కంటే ముందు బెలిండా క్లార్క్ కొట్టింది

ODI చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ కాదని స్పష్టంగా తెలుస్తోంది.

Update: 2023-11-14 03:45 GMT

2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీ సాధించడంతో నెటిజన్లు "ODI చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియా ఆటగాడు" అని పేర్కొంటూ ఉన్నారు.

“గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయ్యాడు” అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌ మాక్స్‌వెల్‌ కాదు.
ప్రపంచ కప్ సందర్భంగా ఒక ఇన్నింగ్స్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్. ఆమె 1997లో 229 పరుగులు చేసింది. 2010లో ప్రచురించబడిన ఇండియా టుడే నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియన్ ప్లేయర్ బెలిండా క్లార్క్ తొలిసారిగా డబుల్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. 1997లో ODI డబుల్ సెంచరీ సాధించింది బెలిండా క్లార్క్.



 దీనిని మేము హింట్ గా తీసుకొని.. ఆన్‌లైన్‌లో మరింత సెర్చ్ చేశాం. ESPN Cricinfo వెబ్‌సైట్‌లో అదే సమాచారాన్ని కనుగొన్నాము. డిసెంబరు 16, 1997న ముంబైలో ఆస్ట్రేలియా, డెన్మార్క్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్ 155 బంతుల్లో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.



 డబుల్ సెంచరీ సాధించిన రికార్డును మొదటిసారిగా బెలిండా క్లార్క్ అందుకుందని.. 26 ఏళ్ల తర్వాత మ్యాక్స్‌వెల్ ఆ లిస్టులో చేరాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఇదే విషయాన్ని ధృవీకరించింది.



 

అయితే ఆస్ట్రేలియా తరపున మెన్స్ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ అంటూ పలు నివేదికలు తెలిపాయి. పురుషుల ODIలలో డబుల్ సెంచరీ సాధించిన మొదటి వ్యక్తి అని స్పష్టంగా పేర్కొన్నారు.


ODI చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ కాదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఈ వాదన తప్పుదారి పట్టించేది. అయితే, మెన్స్ క్రికెట్ లో భాగంగా వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు మ్యాక్స్ వెల్.


Claim :  Glenn Maxwell is the first Australian player to score a double century in ODI history
Claimed By :  Social media
Fact Check :  Misleading
Tags:    

Similar News