ఫ్యాక్ట్ చెక్: కుంభమేళాలో 100 అడుగుల భారీ పాము కనిపించిందంటూ వైరల్ అవుతున్న వీడియో ఏఐ సృష్టి
కుంభమేళాలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ;

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక జనవరి 29న మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు ఆచరించడానికి దాదాపు 10 కోట్ల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. మౌని అమావాస్య రోజున గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద 'అమృత స్నాన్' కోసం 10 కోట్ల మంది యాత్రికుల కోసం ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సందర్భంగా యాత్రికుల రాకపోకలను సజావుగా సాగించేందుకు, భారతీయ రైల్వేలు కూడా విస్తృతమైన ప్రణాళికను రూపొందించాయి. మౌని అమావాస్య రోజున సాధారణ రైళ్లకు అదనంగా 190 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ప్రయాగ్‌రాజ్ నుండి ప్రతి నాలుగు నిమిషాలకు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయని భారతీయ రైల్వే తెలిపింది.
పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కూడా భారీగా పెంచింది. AI- శక్తితో పనిచేసే CCTV కెమెరాలు, డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించారు. మహాకుంభమేళా ప్రాంతాన్ని రాబోయే కొద్ది రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. స్థానికులు నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగించకుండా ఉండాలని, బదులుగా ద్విచక్ర వాహనాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికుల రాకపోకలను సులభతరం చేయడానికి నడకకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
అయితే కొందరు కుంభమేళాలో స్నానం చేస్తూ ఉండగా వెనుక ఓ పెద్ద పాము నీటిలో నుండి లేచినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
అయితే కొందరు కుంభమేళాలో స్నానం చేస్తూ ఉండగా వెనుక ఓ పెద్ద పాము నీటిలో నుండి లేచినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
కుంభమేళాలో 100 అడుగుల పొడవైన పాము కనిపించిందంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 100 అడుగుల భారీ సర్పం కుంభమేళాలో కనిపించిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా భారీ సర్పం కనిపించినట్లుగా ఎలాంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. అంత భారీ పాము కుంభమేళాలో కనిపించి ఉంటే తప్పకుండా వార్తల్లో వచ్చి ఉండేది.
ఇదే తరహాలో పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. భారీ పాము నీళ్ళల్లో కనిపిస్తూ ఉన్నా కూడా అక్కడే ఉన్న ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందకుండా ఉండడం చూడొచ్చు. అక్కడి వ్యక్తుల్లో హావభావాల్లో ఎలాంటి తేడాలు కనిపించలేదని వీడియోను నిశితంగా పరిశీలించగా అర్థం అవుతోంది.
ఇలాంటి భారీ పాము కనిపించిందనే అంశంపై విశ్వసనీయ నివేదికలు లేకపోవడం వీడియో కల్పితమని నిర్ధారిస్తుంది. వైరల్ వీడియోకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం, వీడియోలో పలు లోపాలు ఉండడం మహాకుంభమేళా వద్ద భారీ పాము కనిపించిందనే వాదనల్లో నిజం లేదు. వీడియో తప్పకుండా ఏఐ ఉత్పత్తి అనే అనుమానాలను కలిగిస్తూ ఉంది.
https://wasitai.com/ లో వైరల్ పోస్టులు ఏఐ సృష్టి అంటూ తేలింది.
పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా భారీ పాము కనిపించిందనే వాదనల్లో ఎలాంటి నిజం లేదంటూ తేల్చాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నో వదంతులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కూడా పలు పోస్టులు సృష్టించారు. మరికొందరు ప్రముఖులు కూడా ప్రయాగరాజ్ కు రాకున్నా కూడా వచ్చారంటూ ఏఐ ద్వారా పోస్టులను సృష్టించారు. వాటిలో చాలా వాటిని తెలుగుపోస్టు నిజ నిర్ధారణ చేసింది. భారీగా ప్రజలు హాజరయ్యే ఓ కార్యక్రమం చుట్టూ ఎన్నో వార్తలు, వదంతులు వ్యాప్తి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సమాచారం కోసం అధికారిక ప్రకటనలపై ప్రజలు దృష్టి పెట్టడం మంచింది.
కాబట్టి, ప్రయాగ్ రాజ్ లో భారీ సర్పం కనిపించిందంటూ వైరల్ అవుతున్న వీడియోలు ఏఐ సృష్టి అని మేము ధృవీకరించాము.
Claim : కుంభమేళాలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉండగా భారీ పాము ప్రత్యక్షమైంది
Claimed By : Social Media Users
Fact Check : False