ఫ్యాక్ట్ చెక్: అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ప్లేట్ లో నుండి గుడ్డును లాక్కున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఏపీలో కాదు.
అంగన్వాడీ స్కూల్ లో పిల్లల ప్లేట్ లో నుండి గుడ్డును లాక్కున్నారు
తెలుగు రాష్ట్రాలలో అంగన్వాడీ స్కూల్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. చాలా ఊళ్ళల్లో ఈ స్కూల్స్ ను ప్రీ స్కూల్స్ గా ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే చిన్న పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ఒక్కో రోజు.. ఒక్కో రకమైన మెనూ ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలకు పెడుతూ ఉంటారు.
మహిళలు, పిల్లల అభివృద్ధి- సంక్షేమాన్ని చూసేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 257 ICDS ప్రాజెక్ట్‌లు ఉండగా.. 48,770 ప్రధాన అంగన్వాడీ సెంటర్లు.. 6,837 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 26 జిల్లాల్లో ప్రభుత్వం పోషకాహార లోపం సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. వివిధ విధాన, వ్యవస్థాగత అవసరాలను పరిష్కరించడానికి.. సమీకృత శిశు అభివృద్ధి పథకం, అంగన్‌వాడీ సేవల పథకాల రూపకల్పన చేయడమే కాకుండా.. అమలుపై కూడా దృష్టి పెట్టింది. పిల్లలకు పోష్టికాహారం అందించడమే కాకుండా.. గర్భవతులకు, బాలింతల ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటూ ఉంటారు.
చిన్న పిల్లలు తింటున్న ప్లేట్లలో నుండి కోడి గుడ్లను తీసేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. కొందరి సోషల్ మీడియా యూజర్లు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుందంటూ ఆరోపిస్తున్నారు.
ఆ వీడియో మీద కూటమి ప్రభుత్వం 'పూర్ టు రిచ్' చేస్తామని చెప్పడంలో నిజం ఇదేనేమో అని ఆ వీడియో మీద ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్ కు చెందినది కాదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా.. అందులో కన్నడ భాషలో గోడ మీద అక్షరాలు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. కన్నడ-తెలుగు అక్షరాలు కాస్త ఒకేలా ఉండడంతో ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందని కొందరు భ్రమ పడి ఉండవచ్చు.
దీన్ని బట్టి 'Anganwadi Karnataka' అనే కీలక పదాలను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఈ ఘటనకు సంబంధించిన పలు వార్తా కథనాలను, వీడియోలను మేము కనుగొన్నాం.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఇద్దరు అంగన్‌వాడీ వర్కర్లు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు ప్లేట్‌లో గుడ్లు అందించిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ చర్యను చిత్రీకరించిన తర్వాత ఇద్దరు కార్మికులు గుడ్లను వెనక్కి తీసుకున్నారు. వీడియో తీసిన వెంటనే భోజనం చేస్తున్న సమయంలో పిల్లల ప్లేట్లలోని గుడ్లను వెనక్కి తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్లు తప్పనిసరి అని చెప్పారు. అయితే గుడ్ల విషయంలో అంగన్వాడీ వర్కర్లు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆగస్టు 9న విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై కర్ణాటక మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామని, ఇద్దరు కార్మికులను సస్పెండ్ చేయాలని డిపార్ట్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పీటీఐ నివేదించింది. ఈ కేసుకు సంబంధించి సమగ్ర నివేదికను కూడా మంత్రి కోరారు.
"పౌష్టికాహారాన్ని అందించడం, సమాన విద్యను అందించడం అంగన్‌వాడీల లక్ష్యం. నిరుపేద పిల్లలకు ఎటువంటి అన్యాయం జరగదు," అని లక్ష్మీ హెబ్బాల్కర్ ఆమె అన్నారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు.
ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుందంటూ తెలుగు మీడియా సంస్థలు కూడా నివేదికలను ప్రచురించాయి.

కాబట్టి, పిల్లల ప్లేట్లలో నుండి గుడ్లను తీసేసుకుంటున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కాదు.
Claim : ఏపీ అంగన్వాడీ స్కూల్ లో పిల్లల ప్లేట్ లో నుండి గుడ్డును లాక్కున్నారు
Claimed By : social media users
Fact Check : False