ఫ్యాక్ట్ చెక్: 2018లో వేడి తగ్గేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇటీవలివిగా ప్రచారం చేస్తున్నారు
2018లో వేడి తగ్గేలా చర్యలు తీసుకోవాలని;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ వేడి పెరిగిపోతూ ఉంది. సాయంత్రం పూట తప్ప ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మార్చి ప్రారంభం అవ్వగానే ఆంధ్రప్రదేశ్ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఇది రాబోయే తీవ్రమైన వేసవికి ముందస్తు హెచ్చరిక అని తెలుస్తోంది. ఇప్పటికే పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, అంతకంటే ఎక్కువ నమోదైంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట అత్యధికంగా 41.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (APSDPS) డేటా తెలిపింది. నంద్యాలలోని పీపుల్లి 40.5 డిగ్రీల సెల్సియస్, కర్నూలులోని కోడుమూరు, తిరుపతిలోని గూడూరు 40.2, అనంతపురంలోని విడపనకల్ 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) రాబోయే వారాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని.. ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మార్చిలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వేడి పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉష్ణోగ్రతలు తగ్గించాలంటూ కోరారు. ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఓ న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"సమ్మర్ వస్తుంది కదా @ncbn గారు. ఎండలు ఎక్కువ అంటున్నారు జనాలు. ఒక 10 డిగ్రీ ఎండా తగ్గిస్తారా...?" అంటూ పోస్టులు పెట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉష్ణోగ్రతలు తగ్గించాలంటూ కోరారు. ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఓ న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"సమ్మర్ వస్తుంది కదా @ncbn గారు. ఎండలు ఎక్కువ అంటున్నారు జనాలు. ఒక 10 డిగ్రీ ఎండా తగ్గిస్తారా...?" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఇలాంటి ఆదేశాలు ఏవీ జారీ చేయలేదని తెలుసుకున్నాం. మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. మాకు కొన్ని మీడియా నివేదికలు లభించాయి.
"రాజధానిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గించండి:చంద్రబాబు ఆదేశంతో అధికారుల విస్మయం" అనే టైటిల్ తో మే 21, 2018న తెలుగు వన్ ఇండియాలో ఒక కథనాన్ని మేము చూశాం.
https://telugu.oneindia.com/
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నీరు- ప్రగతి పథకంపై టెలీకాన్ఫరెన్స్ జరిగిందని, రాష్ట్రంలో మండుతున్న ఎండలపై చర్చ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అధికారులను విస్మయానికి గురిచేశాయని కథనంలో ఉంది.
'రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఆయన అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను 10 డిగ్రీలు తగ్గించాలని అధికారులను ఆదేశించారట. చంద్రబాబు తాజా ఆదేశాలకు ఒక్కసారిగా అధికారులందరూ షాక్ తిన్నారని తెలుస్తోంది.' అని కథనంలో ఉంది.
Chandrababu orders officials to control 10 °C temperature | Officials Shocked..! అనే టైటిల్ తో 22 మే 2018న సాక్షిలో ఓ కథనాన్ని చూశాం. చంద్రబాబు నాయుడు ఉష్ణోగ్రతలు తగ్గించేలా చర్యలు తీసుకున్నారని కోరారు.
రాజధాని అమరావతిలో పచ్చదనం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి ప్రాంతంలో అడవులను అభివృద్ధి చేయడం ద్వారా ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల వరకు తగ్గించే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలను సెటైరికల్ గా కథనాలను రాశారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా 10 డిగ్రీలను తగ్గించమని అధికారులను ఆదేశించలేదు.
2018 మే 21న అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పచ్చదనం పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని సూచించారని సమయం సంస్థ కూడా తెలిపింది.
సీఎం చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల్లో చెట్లను పెంచడం లాంటి కార్యక్రమాల ద్వారా వేడిని తగ్గించవచ్చని సూచించారు. అంతేతప్ప అధికారులను ఉన్నపళాన పది డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించమని చెప్పలేదు.
కాబట్టి, రాజధానిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గించండి:చంద్రబాబు ఆదేశంతో అధికారుల విస్మయం అనే వాదన కేవలం సెటైర్ మాత్రమే. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : 2018లో అధికారులు వేడి తగ్గేలా చర్యలు తీసుకోవాలని
Claimed By : Social Media Users
Fact Check : Misleading