ఫ్యాక్ట్ చెక్: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు కూటమి వ్యతిరేకమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఎక్కడా చెప్పలేదు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు కూటమి వ్యతిరేకమని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ప్రముఖ మీడియా సంస్థలు తేల్చి చెప్పాయి. ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి కూడా పలు సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుస్తుందని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయగా.. ఇంకొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశాయి. అటు కూటమి లోనూ.. ఇటు వైసీపీ లోనూ గెలుస్తామనే ధీమా కనిపిస్తూ ఉంది.
ఇంతలో 'ఎగ్జిట్ పోల్స్ కు కూటమి వ్యతిరేకం' అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగా ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 లో వచ్చినట్లుగా ఓ బ్రేకింగ్ ప్లేట్ ను మనం చూడొచ్చు.
ఈ ఫోటోను షేర్ చేస్తున్న వ్యక్తులు 'రిజల్ట్స్ కు కూడా వ్యతిరేకమా?' అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇంతలో 'ఎగ్జిట్ పోల్స్ కు కూటమి వ్యతిరేకం' అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగా ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 లో వచ్చినట్లుగా ఓ బ్రేకింగ్ ప్లేట్ ను మనం చూడొచ్చు.
ఈ ఫోటోను షేర్ చేస్తున్న వ్యక్తులు 'రిజల్ట్స్ కు కూడా వ్యతిరేకమా?' అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించి మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ స్క్రీన్ షాట్ నే థంబ్నైల్ గా టీవీ 9 యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాం.
"జనసేన కార్యకర్తల అరెస్ట్ లు ఆపాలి | Pawan Kalyan tweet on Visakha incident | Nadendla Manohar - TV9" అనే టైటిల్ తో అక్టోబర్ 15న యూట్యూబ్ లో వీడియోను అప్లోడ్ చేశారు.
విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రులపై జనసేన నేతలు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై కొందరు జనసైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను ఖండిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టారు. అరెస్టులు ఆపకపోతే పోలీసు స్టేషన్స్ ముందు బైఠాయించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే వీడియోలో 1:16 నిమిషాల వద్ద నాదెండ్ల మనోహర్ టీవీ 9 ఛానల్ తో మాట్లాడుతూ ఉన్న క్లిప్ ను చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టులోనూ.. ఒరిజినల్ వీడియోనూ పరిశీలించగా రెండూ ఒకటేనని మేము గుర్తించాం. ఒరిజినల్, వైరల్ పోస్టులలో నాదెండ్ల మనోహర్ వెనుక ఉన్న వాళ్లను కూడా సరిపోల్చుకుని చూడగా రెండూ ఒకటేనని మేము గుర్తించాం. అంతేకాకుండా ప్రస్తుత ఎన్నికలకు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని కూడా నిర్ధారించాం.
రెండు ఫ్రేమ్ ల మధ్య పోలికలను మీరు ఇక్కడ గమనించవచ్చు:
నాదెండ్ల మనోహర్ కు సంబంధించి టీవీ9 అప్లోడ్ చేసిన క్లిప్ ను తీసుకుని ఫోటో షాప్ ద్వారా ఎడిట్ చేశారని మేము గుర్తించాము.
ఇక నాదెండ్ల మనోహర్ ఎగ్జిట్ పోల్స్ గురించి ఇలాంటి ప్రకటన చేసి ఉండి ఉంటే తప్పకుండా న్యూస్ ఛానల్స్ ప్రసారం చేసి ఉండేవి.. కానీ అలాంటి కథనాలేవీ మేము గుర్తించలేకపోయాం. జనసేన సోషల్ మీడియా ఖాతాలు, జనసేన నేతల సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఇలాంటి ప్రకటనలు మాకు కనిపించలేదు.
సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. నాదెండ్ల మనోహర్ ఎన్నికల కౌంటింగ్ విషయంలో జనసేన నేతలు అప్రమత్తంగా ఉండాలంటూ కీలక సూచనలు చేశారు.
కౌంటింగ్ నేపథ్యంలో కొంతమంది అల్లరి మూకలు తెనాలిలో ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగా పలు మీడియా సంస్థలు కథనాలను అందించాయి. ఎక్కడా కూడా నాదెండ్ల మనోహర్ జనసేన కూటమి ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకమని చెప్పలేదు.
https://www.etvbharat.com/te/!
https://www.andhrajyothy.com/
కాబట్టి, ఎక్కడా కూడా జనసేన నేత నాదెండ్ల మనోహర్.. కూటమి ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకమని చెప్పలేదు. 2022 అక్టోబర్ 15న న్యూస్ ఛానల్ క్లిప్పింగ్ ను స్క్రీన్ షాట్ తీసి ఎడిట్ చేశారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు కూటమి వ్యతిరేకమని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు
Claimed By : Social Media Users
Fact Check : Misleading