ఫ్యాక్ట్ చెక్: బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఓటమి అంటూ వైరల్ అవుతున్న ఓపీనియన్ పోల్ ను ఎడిట్ చేశారు.
ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి మనోజ్ తివారీ ఓడిపోతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా తప్పుడు సమాచారం ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు సంబంధించి వైరల్ అవుతూ ఉంది. ప్రస్తుతం, ABP న్యూస్-సి ఓటర్ సర్వే లోగో యొక్క అభిప్రాయ సేకరణను పోలిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వైరల్ ఒపీనియన్ పోల్ ఢిల్లీ ఈశాన్య లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఓడిపోయినట్లు చూపుతోంది. సర్వే ప్రకారం, NDA 90-110 సీట్లు, INDIA కూటమికి 70-90 సీట్లు, ఇతరులకు 0-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
“मनोज तिवारी तो गयो" (మనోజ్ తివారీ ఓడిపోతున్నారు) అనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టును ఎడిట్ చేశారు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “सोशल मीडिया पर ओपिनियन पोल को लेकर abp न्यूज़ का Fake Screenshot वायरल हो रहा है. ऐसी खबर ABP News पर प्रसारित नहीं की गई है. ऐसी भ्रामक खबरों से सावधान रहें. सही और सटीक जानकारी के लिए हमारे सोशल मीडिया हैंडल को फॉलो करें” అంటూ ABP న్యూస్ వారి అధికారిక సోషల్ మీడియాలో వైరల్ స్క్రీన్‌షాట్‌ను ఫేక్ అంటూ వివరణ ఇచ్చినట్లు మేము కనుగొన్నాము.
ABP న్యూస్‌తో కూడిన అభిప్రాయ సేకరణకు సంబంధించిన.. నకిలీ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. ఏబీపీ న్యూస్‌లో అలాంటి వార్తలేవీ ప్రసారం కాలేదని తెలిపింది. ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం కోసం తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లను అనుసరించాలని కోరింది.
'ABP Lok Sabha opinion poll on Manoj Tiwari' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. మేము డిసెంబర్ 26, 2023న ABP News అప్లోడ్ చేసిన వీడియోను YouTube ఛానల్ లో చూశాం. 0:09 టైమ్ స్టాంప్ దగ్గర మనోజ్ తివారీ ఎన్నికల అంచనాలను చూశాం. అందులో మనోజ్ తివారీ ప్రత్యర్థికంటే ముందు ఉన్నారని మేము గమనించాం.
వైరల్ ఒపీనియన్ పోల్‌లో ఎన్డీయే 90-110 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అయితే ఒరిజినల్ పోల్‌లో ఎన్డీయే 150-160 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు.
వైరల్ పోస్ట్ నకిలీ అని పేర్కొంటూ ABP న్యూస్ ప్రచురించిన ఒక వివరణాత్మక కథనాన్ని మేము కనుగొన్నాము.
కాబట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మనోజ్ తివారీ ఓడిపోతారంటూ కల్పిత అభిప్రాయ సేకరణ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోందని మేము ధృవీకరిస్తున్నాం. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి మనోజ్ తివారీ ఓడిపోతున్నారు.
Claimed By : Social Media Users
Fact Check : False