ఫ్యాక్ట్ చెక్: వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వైరల్ చేశారు

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఓ మహిళతో

Update: 2024-08-23 08:32 GMT

ysrcp

దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య సంబంధం ఉందంటూ ఆమె భర్త మదన్‌మోహన్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శాంతి చెప్పినట్లుగా తాము విడాకులు తీసుకోలేదని.. విజయసాయిరెడ్డితోనే శాంతి బిడ్డను కన్నదని ప్రెస్ మీట్ పెట్టి మరీ మదన్‌మోహన్‌ ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై అప్పట్లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని అన్నారు. ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుసక్రమంలో బురద చల్లుతున్నారని విజయసాయి అన్నారు. సాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వారని ఆమె చెప్పారని గుర్తు చేశారు. తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తోక ఆడించే వారి తోకలను తాము అధికారంలోకి వచ్చాక కట్ చేస్తామని అన్నారు.

ప్లాన్‌ ప్రకారం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. తన పేరు, ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎంతటి వారైన వదిలిపెట్టమని హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేది తమ పార్టీ వాళ్లయినా సరే వదలనని అన్నారు.

ఇంతలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో మహిళా అధికారిణితో విజయసాయి రెడ్డి ఉన్నట్లుగా ఫోటో వైరల్ అవుతూ ఉంది.

Full View





Full View



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ ఫోటోలో ఉన్నది విజయసాయి రెడ్డి కాదు. అడ్వకేట్ సుభాష్ అని వైరల్ ఫోటోల కింద చేసిన కామెంట్లను మేము గుర్తించాం. అడ్వొకేట్ సుభాష్ రెడ్డి గురించి మేము సెర్చ్ చేయగా.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో సుభాష్ రెడ్డికి సంబంధించిన ఫోటోలను మేము గుర్తించాం.

ఇక ఇటీవల విజయసాయి రెడ్డి కొందరు వ్యక్తులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు మొదలు పెట్టారన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ వైసీపీని విమర్శిస్తున్నారని చెప్పారు. ఆయా కమ్యూనిటీల్లో వైసీపీ పట్ల ద్వేషం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ఫేక్ ఐడెంటిటీలు, ఫేక్ అకౌంట్ల వెనుక టీడీపీ సానుభూతిపరులు దాక్కోవడం సిగ్గుచేటన్నారు విజయసాయిరెడ్డి. మాటమీద నిలబడే దమ్ము, విమర్శలను నిరూపించే ధైర్యం ఉంటే సొంత పేర్లతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టాలని సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి.

ఆగస్టు 20వ తేదీన విజయసాయి రెడ్డి అందుకు సంబంధించి పోస్టు పెట్టారు.



అడ్వకేట్ సుభాష్ రెడ్డి తో వైరల్ అవుతున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఫొటోస్ అంటూ కొన్ని సోషల్ మీడియా కనిపించిన పోస్టులు ఇవే.





అందులో టీ-షర్ట్ వేసుకున్న వ్యక్తి పక్కన శాంతి ఉన్నారు. ఆ ఫోటోనే మార్ఫింగ్ చేయడానికి ఉపయోగించారు. ఒరిజినల్ ఫోటోలో విజయ సాయి రెడ్డి తలను మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

రెండు ఫోటోల మధ్య ఉన్న తేడాలను మీరు ఇక్కడ చూడొచ్చు.



 


ఇక మేము గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ప్రముఖ తెలుగు మీడియా సంస్థ RTV ట్విట్టర్ ఖాతాలో కూడా అందుకు సంబంధించిన ఫోటోలను మేము గమనించాం.

"అడ్వకేట్ సుభాష్ తో వైరల్ అవుతున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఫొటోస్.. #assistantcommissioner #Shanti #advocate #subhash #photos #viral #socialmedia #RTV" అంటూ RTV వేసిన ట్వీట్ ను మేము గుర్తించాం.


మరో ప్రెస్ మీట్ లో సుభాష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా శాంతి ప్రస్తావించారు.

Full View



కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్నది విజయసాయి రెడ్డి కాదు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేశారు.


Claim :  వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News