ఫ్యాక్ట్ చెక్: టీడీపీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ షరతులు పెట్టలేదు.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ (BJP), చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP), పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (JSP) 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీని ఓడించడానికి మూడు పార్టీల మధ్య కూటమి ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ (BJP), చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP), పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (JSP) 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు పెట్టుకున్నాయి. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని చేర్చుకోడానికి బీజేపీ మూడు షరతులు పెట్టిందని సూచిస్తూ సోషల్ మీడియా పోస్ట్‌లో ఓ గ్రాఫిక్ ప్లేట్ వైరల్ అవుతూ ఉంది.
వైరల్ క్లెయిమ్ ప్రకారం.. బీజేపీ పెట్టిన మూడు షరతుల్లో ఒకటి టీడీపీ "ప్రత్యేక హోదా" అంశాన్ని ఇకపై లేవనెత్తకూడదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం ఆ విషయంలో ముందుకు వెళ్లడం లేదు. రెండవ షరతు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేస్తారు.. దీనికి టీడీపీ మద్దతు ఇవ్వాలి. మూడవ షరతు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతును అందించాలని చంద్రబాబు నాయుడును బీజేపీ డిమాండ్ చేస్తుంది.
టీడీపీతో పొత్తుకు బీజేపీ షరతులు పెట్టిందని, టీడీపీ కొన్ని షరతులకు అంగీకరిస్తేనే కూటమి ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని ఆ పోస్ట్ లో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కొన్ని షరతులు పెట్టిందని.. వాటిని అమిత్ షాకు ఆపాదించడం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని వైరల్ క్లెయిమ్ లో తెలిపారు.
BJP-TDP కూటమికి సంబంధించిన సమాచారానికి సంబంధించి నిర్దిష్ట కీవర్డ్ సెర్చ్ చేశాం. BJP పెట్టిన షరతులు, లోక్‌సభ ఎన్నికల కోసం అమిత్ షా చేసిన ప్రకటనలు సంబంధిత ఫలితాలను ఇవ్వలేదు. అధికారిక ప్రకటనలు, నమ్మదగిన మీడియా నుండి సరైన సమాచారం లేకపోవడంతో ఈ విషయంపై వస్తున్న వార్తల కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి 7, 2024న, TDP అధినేత నారా చంద్రబాబు నాయుడు, BJPతో పార్టీ పొత్తు గురించి చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో న్యూఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. BJP-TDP కూటమికి సంబంధించి Google లో కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు.. మింట్ వార్తా కథనాన్ని కనుగొన్నాము. వైరల్ పోస్టులోని అదే చిత్రాన్ని మేము కనుగొన్నాం.
ఇక కూటమి సీట్ల సర్దుబాటుపై కూడా స్పష్టత వచ్చింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయకుండగా, బీజేపీ - జనసేనకు కలిపి 31 అసెంబ్లీ సీట్లు, 8 లోకసభ స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇందులో జనాసేన 21 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో, బీజేపీ 6, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ ఒక్క సీటు, జనసేన మూడు సీట్లు ఇవ్వడంతో బీజేపీకి మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరిగాయి.
లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రజల స్థితి గతులు మెరుగు పరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని, ఎన్డీఏ భాగస్వాములుగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. తమ కూటమిని ఆశీర్వదించాలని ఏపీ ప్రజలను చంద్రబాబు కోరారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి తమను గెలిపించి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
మేము భారతీయ జనతా పార్టీ, టీడీపీ రెండింటి అధికారిక సోషల్ మీడియా పేజీలను కూడా తనిఖీ చేసాము.. అమిత్ షా లేదా బీజేపీ షరతులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కనుగొనలేకపోయాం.
బీజేపీతో ఎన్నికల పొత్తు కోసం కొన్ని షరతులను పెట్టారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనప్పటికీ, బీజేపీ అటువంటి షరతులు పెట్టినట్లుగా పత్రికా ప్రకటన లాంటివి రాలేదు. షరతులు అంటూ వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి.
Claim : A post alleges that the BJP has set conditions for alliance with the TDP, with claims that Amit Shah promises to form the alliance if the TDP agrees to certain conditions
Claimed By : Social Media Users
Fact Check : Misleading