ఫ్యాక్ట్ చెక్: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారతజట్టును ప్రధాని మోదీ కలిసిన వీడియో ఇది కాదు

వైరల్ వీడియో 2023లోనిది. 50 ఓవర్ల ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన;

Update: 2025-03-21 06:41 GMT
ఫ్యాక్ట్ చెక్: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారతజట్టును ప్రధాని మోదీ కలిసిన వీడియో ఇది కాదు
  • whatsapp icon

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయాన్ని అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో భారత్ న్యూజిలాండ్ పై గెలిచింది. ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అయిన భారత్‌పై న్యూజిలాండ్ తన శక్తినంతా ఉపయోగించి ఆడింది. చివరికి భారతజట్టు లోయర్ ఆర్డర్ అద్భుతంగా రాణించి, వరుసగా రెండవ ICC టోర్నమెంట్‌ను ఓటమి లేకుండా ముగించింది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించి ముచ్చ‌ట‌గా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.


ఇక భార‌త జ‌ట్టుకు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. టీమిండియాకు రూ. 58 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. ఆటగాళ్ల‌తో పాటు సిబ్బంది, సెలక్ష‌న్ క‌మిటీకి ఈ న‌గ‌దు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపింది. "ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విజయం సాధించిన జ‌ట్టుకు రూ. 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ క్యాష్ రివార్డు ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బందితో పాటు పురుషుల సెలక్ష‌న్ క‌మిటీ సభ్యులకు వ‌ర్తిస్తుంది" అని బీసీసీఐ ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా రెండు ఐసీసీ టోర్నీలలో విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల నిబ‌ద్ధ‌త‌ను బోర్డు గుర్తించిందని బీసీసీఐ తెలిపింది. టీమిండియా బృందం శ్ర‌మ‌కు ఈ న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తున్నాం. ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది,సెలక్ష‌న్ క‌మిటీ సభ్యులకు న‌జ‌రానా ప్ర‌క‌టించ‌డం ఆనందంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు రోజ‌ర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ నుంచి రూ. 19.50 కోట్లు ప్రైజ్‌మ‌నీ దక్కింది.

ఇంతలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆటగాళ్లను సముదాయిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మహ్మద్ షమీ, బుమ్రాలను ప్రధాని మోదీ అందులో కలుసుకున్నారు.

Full View


2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సంభాషిస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

https://www.facebook.com/100073336221321/videos/653936843748933

వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెక్:

వైరల్ వీడియో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించింది కాదు. 2023లో ఐసీసీ 50 ఓవర్ల వరల్డ్ కప్ ఓటమి తర్వాత చోటు చేసుకుంది.

వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా, బ్యాగ్రౌండ్ లో #CWC2023 అనే హ్యాష్‌ట్యాగ్‌ను గమనించాము. ఇది 2023 ICC ప్రపంచ కప్‌ కు సంబంధించింది. అదే విధంగా ఆటగాళ్ల జెర్సీలపై 2023 ప్రపంచ కప్ లోగో కనిపించింది.



 

ముఖ్యంగా వైరల్ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ కలిసిన ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి గాయం కారణంగా దూరమయ్యాడు.

కీవర్డ్ సెర్చ్ ద్వారా మాకు ప్రధాని నరేంద్ర మోదీ 2023లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు ఓడిన తర్వాత వాళ్లను పరామర్శించిన వీడియోలు మాకు లభించాయి.

భారతీయ జనతా పార్టీ ఛానెల్‌లో నవంబర్ 21, 2023న అప్‌లోడ్ చేసిన వీడియో మాకు లభించింది. నవంబర్ 19, 2023న జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతదేశం ఓడిపోయిన తర్వాత ప్రధానమంత్రి మోదీ ఆటగాళ్లను కలిసినట్లు ఈ వీడియోలో ఉంది.

Full View


పలు మీడియా సంస్థలు కూడా యూట్యూబ్ ఛానల్స్ లో ప్రధాని మోదీ ఆటగాళ్లను కలిసిన వీడియోను అప్లోడ్ చేశాయి.

Full View


Full View


ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఖాతాలో కూడా PM Modi Meets the Men in Blue, Comforts Indian Cricket Team After World Cup Final అనే టైటిల్ తో 21 నవంబర్ 2023న వీడియోను పోస్టు చేశారు.

Full View


వైరల్ అవుతున్న వీడియో, ఈ వీడియో ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.

2023 ప్రపంచకప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియా 6 వికెట్ల తేడాతో పాట్ కమిన్స్ నేతృత్వంలోని టీమ్ ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ 2023 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు బాధలో ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆటగాళ్లను కలిశారు. పలు మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.

వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన భారత జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చారని తెలుస్తోంది

ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తయిన తర్వాత భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కలిసినట్లుగా ఎలాంటి నివేదికలు మాకు కనిపించలేదు.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. 2023లో 50 ఓవర్ల వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిన భారతజట్టుకు సంబంధించింది.


Claim :  వైరల్ వీడియో 2023లోనిది. 50 ఓవర్ల ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన తర్వాత ఆటగాళ్లను మోదీ ఓదార్చారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News