ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్న మహిళ కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య కాదు

కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య కాదు

Update: 2024-07-25 15:18 GMT

26 పంజాబ్ రెజిమెంట్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కెప్టెన్ అన్షుమాన్ సింగ్ సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలోని ఇండియన్ ఆర్మీ శిబిరంలో అగ్నిప్రమాదం నుండి ఇతరులను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 19, 2023న షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్షుమాన్ సింగ్ ప్రయత్నించారు. అప్పటికే ఐదుగురు వ్యక్తులను విజయవంతంగా కాపాడినా.. తన ప్రాణాలను తాను కాపాడుకోలేకపోయారు.

జూలై 5, 2023న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరణానంతరం కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు భారతదేశపు రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రదానం చేశారు.
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్ భారత సైన్యంలోని నెక్స్ట్ ఆఫ్ ది కిన్ (NOK) విధానానికి సవరణలు చేయాలని కోరారు. ఆర్మీ సిబ్బంది మరణించిన సందర్భంలో కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కేటాయిస్తారని.. అయితే ఈ డబ్బు కోడలు తీసుకుని వెళుతుందని ఆరోపించారు. తల్లిదండ్రులకు కూడా సహాయం అందేలా నిబంధనలను మార్చాలని కోరారు. అన్షుమాన్ మరణం తర్వాత తమ కోడలు స్మృతి సింగ్ తమతో నివసించడం లేదని వారు తెలిపారు.
ఇంతలో ఓ మహిళకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. ఆఫ్-వైట్ చీర ధరించి ఓ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి ఇన్‌స్టాగ్రామ్ వైరల్ వీడియో" అనే టైటిల్‌తో ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ వైరల్ నేషన్ అప్‌లోడ్ చేసింది.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అయిన రీల్‌లో ఉన్న మహిళ అమరవీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్ కాదు.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్ లను తీసుకుని సెర్చ్ చేయగా.. అదే చిత్రాలను పోస్ట్ చేసిన Mogra.in అనే Instagram ఖాతాని కనుగొన్నాము. పోస్ట్‌లో, మోగ్రా @reshsebuతో సహా మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.



మా తదుపరి విచారణలో.. వైరల్ రీల్‌లో ఉన్న మహిళ రేష్మా సెబాస్టియన్ అని తేలింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రేష్మా 24 ఏప్రిల్ 2024న ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆమెను స్మృతి సింగ్‌తో పోలుస్తూ తప్పుడు వాదనలతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.



మేము రేష్మా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వివాదానికి సంబంధించి వివరణ ఇస్తూ ఓ పోస్ట్‌ను కూడా కనుగొన్నాము. “ఇది స్మృతి సింగ్ (ఇండియన్ ఆర్మీ సైనికుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య) పేజీ/IG ఖాతా కాదని అందులో తెలిపారు. ముందుగా ప్రొఫైల్ వివరాలు, బయోని చదవండని కోరారు. దయచేసి తప్పుడు సమాచారం, ద్వేషపూరిత కామెంట్స్ చేయడం మానుకోండని హితవు పలికారు.


ఫస్ట్ పోస్ట్ దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది. “కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్యగా భావించి ఇన్‌ఫ్లుయెన్సర్ ను ట్రోల్ చేస్తున్నారు." అంటూ కథనంలో తెలిపారు. సోషల్ మీడియా వినియోగదారులు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్‌తో పోలికను చూసి ఇన్‌ఫ్లుయెన్సర్ రేష్మా సెబాస్టియన్ పై విమర్శలు చేస్తున్నారంటూ కథనంలో తెలిపారు. కేరళకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేష్మా సెబాస్టియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్ కాదని స్పష్టం చేశారని వివరించారు.
లైవ్ మింట్ కూడా.. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేష్మా సెబాస్టియన్ తాను కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్ కాదని వివరణ ఇచ్చారని తమ కథనంలో తెలిపింది.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్న మహిళ కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్ కాదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేష్మా సెబాస్టియన్.


Claim :  వీరమరణం పొందిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News