ఫ్యాక్ట్ చెక్: విదేశాలకు ఎగుమతి చేసే ఆశీర్వాద్ ఆటాకు మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసిన ఐటీసీ

హలాల్ సర్టిఫైడ్ లోగోతో కూడిన ఆశీర్వాద్ ఆటా చిత్రం X (ట్విట్టర్)లో షేర్ చేస్తున్నారు. అన్ని ITC ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్ ఉందని దీంతో ఆ సంస్థకు చెందిన ప్రోడక్ట్స్ ను బహిష్కరించాలనే వాదనతో పోస్టులను పెడుతున్నారు

Update: 2023-12-09 07:55 GMT

Aashirvad Atta

హలాల్ సర్టిఫైడ్ లోగోతో కూడిన ఆశీర్వాద్ ఆటా చిత్రం X (ట్విట్టర్)లో షేర్ చేస్తున్నారు. అన్ని ITC ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్ ఉందని దీంతో ఆ సంస్థకు చెందిన ప్రోడక్ట్స్ ను బహిష్కరించాలనే వాదనతో పోస్టులను పెడుతున్నారు.

హిందీలో వైరల్ అవుతున్న పోస్టులో “Halal certified. #BoycottHalalProducts. ITC के सभी प्रोडक्ट्स (आशीर्वाद आटा) का आज से मेरे द्वारा पूर्णतया बहिष्कार। विकल्प ” అని ఉంది.
#BoycottHalalProducts నేను ఈరోజు నుండి అన్ని ITC ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరిస్తున్నాను. అంటూ పోస్టులు పెట్టారు.


ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఇమేజ్ లో ఉన్న హలాల్ ధృవీకరణ తప్పనిసరి అన్న ప్రోడక్ట్స్ భారతదేశంలో విక్రయించరని, దేశాలకు ఎగుమతి చేయడానికి మాత్రమే ఉద్దేశించిన ఆశీర్వాద ఆటా అని స్పష్టంగా తెలుస్తోంది.

మేము Aashirvaad atta అంటూ సెర్చ్ చేయగా.. మేము aashirvaad.com అనే వెబ్‌సైట్‌ను కనుగొన్నాము. అన్ని భారతీయ ఉత్పత్తులను అందులో ఉంచారు. అక్కడ మాకు హలాల్ ధృవీకరించిన ఉత్పత్తులు ఏవీ కనుగొనలేకపోయాం.

ITC replied to an X (Twitter) user who claimed that ITC is forcing Hindus to eat food certified by extremist groups. ITC replied to this allegation with the comment: “A completely false, erroneous and mischievous message is being posted/circulated implying that Aashirvaad Atta is being sold in India with Halal logo. We would like to clarify that the pack shown in these messages is a very old Export-only pack that was never meant for sale within India. Such kind of erroneous and false messages implying that Aashirvaad Atta is being sold with a Halal logo do not help anyone. Hence, we urge all to not publish or circulate such messages. If anyone has any query related to Aashirvaad Atta or any other products of Aashirvaad please write to us at
itccares@itc.in
.

కొన్ని గ్రూపులు హలాల్ ధృవీకరించిన ఆహారాన్ని తినమని హిందువులను బలవంతం చేస్తున్నారని ఆరోపిస్తున్న X (ట్విట్టర్) వినియోగదారుకు ITC సమాధానం ఇచ్చింది. ఈ ఆరోపణకు ITC ఇలా సమాధానమిచ్చింది: “ఆశీర్వాద్ ఆటా భారతదేశంలో హలాల్ లోగోతో విక్రయిస్తున్నారని సూచించే ఫోటోలు పూర్తిగా తప్పుడు సమాచారంతో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ సందేశాలలో చూపించిన ప్యాక్ చాలా పాతది. ఎగుమతులకు మాత్రమే ఉపయోగించే ప్యాక్ అని మేము స్పష్టం చేస్తున్నాము, ఇది భారతదేశంలో ఎప్పుడూ అమ్మలేదు. ఆశీర్వాద్ ఆటా హలాల్ లోగోతో విక్రయిస్తున్నారనే సందేశాలను ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మేము అందరినీ కోరుతున్నాము. ఎవరైనా Aashirvaad Atta లేదా Aashirvaad యొక్క ఏదైనా ఇతర ఉత్పత్తులకు సంబంధించిన ఏవైనా సందేహాలను కలిగి ఉంటే, దయచేసి
itccares@itc.in
ని సంప్రదించండి" అని కోరారు.
వైరల్ వాదనను ITC కేర్స్ కూడా తోసిపుచ్చింది. ఈ మెసేజ్‌లలో చూపిన ప్యాక్ చాలా పాతదని స్పష్టం చేశారు.

అందువల్ల, హలాల్ ధృవీకరణ తప్పనిసరి అయిన దేశాలకు సరఫరా చేయాల్సిన ఆశీర్వాద ఆటా ప్యాక్ చిత్రం తప్పుడు వాదనతో సోషల్ మీడియాలో చెలామణిలో ఉంది. భారతదేశంలోని ఆటాకు హలాల్-ధృవీకరణ లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ITC is selling its halal-certified products, like Aashirvad atta, in the Indian market.
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News