ఫ్యాక్ట్ చెక్: సముద్రంలోని కంటైనర్ లో ఐఫోన్ లు దొరకలేదు..!
సముద్రంలో ఓ కంటైనర్ లో ఐఫోన్ లు దొరికాయని చెబుతూ వీడియో వైరల్ అవుతోంది.
సముద్రంలో ఓ కంటైనర్ లో ఐఫోన్ లు దొరికాయని చెబుతూ వీడియో వైరల్ అవుతోంది.
సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్‌లో యాపిల్ ఐఫోన్‌లు కనిపించాయని, ఓడలో ప్రయాణిస్తున్న వ్యక్తులు దానిని గుర్తించి తెరిచారని చెబుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
మొదట, ఈ సంఘటన గురించి సంబంధిత కీవర్డ్స్ తో ఇంటర్నెట్‌లో వెతకగా, దీనికి సంబంధించిన వివిధ వీడియోలు యూట్యూబ్ ఛానెల్ 'డెనిస్ మిఖైలెంకో'(Denis Mikhailenko) లో కనుగొన్నాము. ఆగస్ట్ 3, 2018న అప్‌లోడ్ చేసిన వీడియోలో, కొందరు వ్యక్తులు కంటైనర్‌ను ఓడ వైపుకు లాగడం చూడవచ్చు.
జూన్ 3, 2020న, మరో వీడియో పోస్ట్ చేశారు అందులో ఓడలోని వ్యక్తులు కంటైనర్‌ను తెరిచి అందులోని పెట్టెలను తీసుకెళ్ళినట్లు చూడవచ్చు. వీడియో వివరణలో బాక్సుల లోపల ఏమి ఉందో వివరించారు.
https://youtube.com/shorts/dQ983bvP5YU?feature=share
సిగరెట్ కంపెనీ పేరు "D&B" అని ఈ బాక్స్‌లపై చూడొచ్చు. ఆగస్టు 18, 2021న పోస్ట్ చేసిన పూర్తి వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. బాక్స్‌లపై "ఫస్ట్ క్వాలిటీ టొబాకో డీలక్స్ ఫిల్టర్" అని వ్రాసి ఉంచడం కూడా చూడవచ్చు.
సిగరెట్ కంపెనీ పేరు "D&B" అని ఈ బాక్స్‌లపై చూడొచ్చు. ఆగస్టు 18, 2021న పోస్ట్ చేసిన పూర్తి వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. బాక్స్‌లపై "ఫస్ట్ క్వాలిటీ టొబాకో డీలక్స్ ఫిల్టర్" అని వ్రాసి ఉంచడం కూడా చూడవచ్చు.
మేము "D&B" కంపెనీ లోగోను తనిఖీ చేసాము. అది వైరల్ వీడియోలోని దృశ్యాలతో సరిపోలింది. ఇక ఐఫోన్‌లు కంటైనర్‌లో ఉన్నట్లు ఏ వార్తా సంస్థ లేదా ఆపిల్ కంపెనీ ప్రకటించలేదు.
http://www.cigarety.by/brand.php?n=10&l=త్రీ
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా కంటైనర్‌లో ఐఫోన్‌లు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా కంటైనర్‌లో ఐఫోన్‌లు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
Claim : Footage of iPhones found in a lost container at sea being taken by passers-by.
Claimed By : Social Media Users
Fact Check : False