ఫ్యాక్ట్ చెక్: ప్రధాని మోదీ ముస్లింలు ధరించే స్కల్ క్యాప్ ను ధరించలేదు
ముస్లింలు ధరించే స్కల్ క్యాప్ ను ప్రధాని నరేంద్ర మోదీ ధరించారంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ముస్లింలు ధరించే స్కల్ క్యాప్ ను ప్రధాని నరేంద్ర మోదీ ధరించారంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్కల్ క్యాప్ ధరించి ఉన్న రెండు ఫొటోల సెట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలు ఫిబ్రవరి 10, 2023న, అల్జామియా-తుస్-సైఫియా అరబిక్ అకాడమీకి సంబంధించిన ముంబై క్యాంపస్‌ను మోదీ ప్రారంభించినప్పటివని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఫిబ్రవరి 10న, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను ట్వీట్ చేశారు. వీటన్నింటిలో ఎక్కడా కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్కల్ క్యాప్ ధరించినట్లు కనిపించలేదు. టోపీ లేని మోదీ చిత్రాన్ని మేము కనుగొన్నాము. స్పష్టంగా, వైరల్ చిత్రాలు ఎడిట్ చేశారని మేము గుర్తించాం.వైరల్ ఫోటోకు ఒరిజినల్ ఫోటోకు మధ్య ఉన్న తేడాను మీరు ఇక్కడ గమనించగలరు:
ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన చిత్రాలలో కూడా ఆయన స్కల్ క్యాప్ ధరించి కనిపించలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోలు ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
Claim : PM Narendra Modi wore a skull cap during the inauguration of the Mumbai campus of Aljamea-tus-Saifiyah Arabic Academy.
Claimed By : Twitter Users
Fact Check : False