Fact check: మిస్టర్ బీన్ నటుడు రోవన్ అట్కిన్సన్ చనిపోయారా..?
బ్రిటీష్ నటుడు రోవన్ అట్కిన్సన్ అంటే పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. టెలివిజన్ క్యారెక్టర్ 'మిస్టర్ బీన్' అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తారు.
బ్రిటీష్ నటుడు రోవన్ అట్కిన్సన్ అంటే పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. టెలివిజన్ క్యారెక్టర్ 'మిస్టర్ బీన్' అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తారు. కొంచెం అమాయకత్వం, ఇంకొంచెం అతి తెలివి.. కలిసిన ఈయన షోలను చూడడం చిన్న పిల్లలకు ఎంతో ఇష్టం. 1990 నుండి 1995 వరకు నడిచిన మిస్టర్ బీన్ కామిక్ షోలలో ఆయన చేసిన క్యారెక్టర్ ఓ దిగ్గజ పాత్రగా మారింది. చార్లీ చాప్లిన్ తర్వాత అంతటి ఇంపాక్ట్ కలిగించిన కామిక్ పాత్ర 'మిస్టర్ బీన్' అని ఇప్పటికీ చెబుతుంటారు. అట్కిన్సన్ (66) 'జానీ ఇంగ్లీష్', 'బ్లాక్ యాడర్' ఫ్రాంచైజీ సినిమాల ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే ఆయన మరణించారని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్ట్‌లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆయన మరణం గురించి పుకార్లు 2012 నుండి వస్తూనే ఉన్నాయి.. వాటిని మీడియా సంస్థలు వాటిని ఖండిస్తూనే ఉన్నాయి. ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఆయన బ్రతికే ఉన్నారని చెబుతూ వస్తున్నాయి. రోవన్ అట్కిన్సన్ చనిపోయారనే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది.
భారత్ లోని ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లు ఆయన చనిపోయారనే కథనాలను నమ్మి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనే పోస్టులు పెట్టడం మొదలైంది.
భారత్ లోని ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లు ఆయన చనిపోయారనే కథనాలను నమ్మి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనే పోస్టులు పెట్టడం మొదలైంది.
నిజమేమిటంటే:
వైరల్ అవుతున్న పోస్టులు సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది. ఆయనకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి గూగుల్ సెర్చ్ చేశాం. ఆయన చనిపోలేదని.. ఆయన మరణించారనే కథనాన్ని ఏ మీడియా సంస్థ కూడా ప్రచురించలేదు. ప్రముఖ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా ఆయన చనిపోలేదని, బ్రతికే ఉన్నారని తెలియజేశాయి.
అట్కిన్సన్ షెడ్యూల్ చూసుకునే టాలెంట్ ఏజెన్సీ అయిన PBJ మేనేజ్‌మెంట్, జూన్‌లో అనధికారిక Mr బీన్ ఫేస్‌బుక్ పేజీలో ఆయన మరణానికి సంబంధించిన పోస్టులను ఖండించింది. ఆయన చనిపోలేదని పలు మీడియా సంస్థలకు తెలిపింది. 2012 నుండి ఆయన మరణంపై ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదే రకమైన పోస్టులు పదేపదే తిరిగి వస్తున్నాయి. ఇక మేము అట్కిన్సన్ మరణంపై విశ్వసనీయమైన వార్తా నివేదికలను కనుగొనలేదు. ఆయన చనిపోయినట్లుగా ఏ ప్రముఖులు కానీ, కుటుంబ సభ్యులు కానీ చెప్పలేదు.
ప్రస్తుతం, అట్కిన్సన్ 2023లో విడుదల కానున్న 'వోంకా' సినిమా కోసం పని చేస్తున్నారు. ఒలివియా కోల్‌మన్ మరియు సాలీ హాకిన్స్‌తో ఆయన ఈ సినిమాలో కలిసి నటించనున్నారు. ఇక ఆయన చనిపోలేదని 'బూమ్ లైవ్' సంస్థ కూడా నిజ నిర్ధారణ చేసింది.

Claim : మిస్టర్ బీన్ నటుడు రోవన్ అట్కిన్సన్ చనిపోయారా..?
Claimed By : Social Media Users
Fact Check : False