ఫ్యాక్ట్ చెక్: కుల వివక్షను ఎదుర్కొన్న కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర భారతదేశాన్ని విడిచిపెట్టలేదు
న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో జన్మించాడు. రచిన్ తల్లిదండ్రులు ఆ దేశానికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అతను ఎటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.
న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో జన్మించాడు. రచిన్ తల్లిదండ్రులు ఆ దేశానికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అతను ఎటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్. ప్రపంచకప్ టోర్నీలో అతను చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు.
రచిన్ రవీంద్ర భారతదేశంలో కుల వివక్షను ఎదుర్కొన్న కారణంగా 3 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని విడిచిపెట్టినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతూ ఉంది.
రచిన్ రవీంద్ర గురించి.. “ब्राह्मण रत्न रचिन रविंद्र कृष्णमूर्ति का पाकिस्तान के खिलाफ 100. विश्व कप में अब तक 500 से ज्यादा रन । 3 शतक, 3 अर्धशतक, 8 विकेट। भविष्य का क्रिकेट जगत का सुपरस्टार। अच्छा किया भाई तुमने 3 साल पहले भारत छोड़ दिया क्योंकि यहां तो तुम्हारी जाति देखकर कह देते की ब्राह्मणवाद है। मत खिलाओ। आज उसी बैंगलोर की धरती पर जहां जाति का भेदभाव झेलकर रविंद्र ने भारत छोड़ा था उसपर पाकिस्तान के खिलाफ़ शतक लगा दिया है।“ అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
“బ్రాహ్మణుడైన రచిన్ రవీంద్ర కృష్ణమూర్తి పాకిస్తాన్‌పై 100 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 500కు పైగా పరుగులు. 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు, 8 వికెట్లతో క్రికెట్ ప్రపంచ క్రికెట్ లో సూపర్ స్టార్ కాబోతున్నాడు. బ్రదర్, నువ్వు 3 సంవత్సరాల క్రితం భారతదేశం విడిచి వెళ్ళిపోయావు, లేకుంటే నీ కులం చూసి చాలా మంది బ్రాహ్మణవాదానికి మద్దతుదారు అని పిలిచేవారు. కుల వివక్షకు గురై భారత్‌ను విడిచిపెట్టిన రవీంద్ర అదే బెంగళూరు గడ్డపై నేడు పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు." అని ఆ పోస్టుల్లో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ లో జన్మించాడు.
cricbuzz.com ప్రకారం, న్యూజిలాండ్ లోని వెల్లింగ్‌టన్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు రచిన్ రవీంద్ర. ఎడమచేతి వాటం బ్యాటర్. అతను నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకోగలడు. అతని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అద్భుతం. అతను దేశీయ సర్క్యూట్‌లో రాణించాడు. న్యూజిలాండ్ U-19, న్యూజిలాండ్ A తరపున రాణించాడు. రచిన్ సాధారణంగా వెల్లింగ్‌టన్ టీమ్ తరపున టాప్ ఆర్డర్ లో ఆడుతాడు. బంతితో కూడా రాణించగలడు.
న్యూజిలాండ్ క్రికెట్ వెబ్‌సైట్ ప్రకారం, రచిన్ మొదటి పేరు భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ ల కారణంగా అతడికి పేరు పెట్టాడు తండ్రి. అతను హట్ ఇంటర్నేషనల్ బాయ్స్ స్కూల్ ఓపెనింగ్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. న్యూజిలాండ్ జట్టులో అతి పిన్న వయస్కుడిగా ఉండడమే కాకుండా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ క్రికెట్ కు సంబంధించి యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
cricreads.com ప్రకారం, రచిన్ రవీంద్ర తండ్రి.. రవి కృష్ణమూర్తి సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, 1997లో న్యూజిలాండ్ కు వలస వెళ్ళిపోయారు. రవి కృష్ణమూర్తి తన స్వస్థలమైన బెంగళూరులో క్లబ్-స్థాయి క్రికెట్ ఆడారు. రచిన్ రవీంద్ర తల్లి పేరు దీపా కృష్ణమూర్తి.
న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర భారతదేశంలో కుల వివక్షను ఎదుర్కొన్న కారణంగా 3 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని విడిచిపెట్టారనే వాదన తప్పు. అతను న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు 1997లో భారతదేశం నుండి అక్కడికి వెళ్లారు