ఫ్యాక్ట్ చెక్: తనిష్క్ జ్యువెలరీ సంస్థ మహిళలకు ఉచితంగా బహుమతులను ఇవ్వడం లేదు. ఇదంతా స్కామ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలకు గుర్తుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.;

Update: 2023-03-21 06:32 GMT
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలకు గుర్తుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎన్నో సవాళ్లను అధిగమించి మహిళలు సాధించిన విజయాలను స్మరించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ రోజున మహిళలకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారికి వివిధ రకాల బహుమతులు అందిస్తారు. అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తనిష్క్ జ్యువెలరీ మహిళలకు బహుమతులు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. పోస్ట్‌లో ఓ లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానమిస్తే రూ.6వేలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా పోస్ట్‌లో పేర్కొంది.వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కూడా ఈ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ వైరల్ మెసేజీ ఒక స్కామ్. మహిళా దినోత్సవం సందర్భంగా తనిష్క్ అలాంటి బహుమతులేమీ ఇవ్వడం లేదు.

 

వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో షేర్ చేసిన లింక్ ఒకదానికొకటి భిన్నంగా ఉంది. క్లిక్ చేసినప్పుడు తనిష్క్ అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ అవ్వకుండా.. మరొక వెబ్‌సైట్ లింక్ కనిపిస్తుందని తెలుగుపోస్ట్ గమనించింది.

 

 

మేము తనిష్క్ జ్యువెలరీ వెబ్‌సైట్‌లోనూ, వారి సోషల్ మీడియా ఖాతాలలో ఇటువంటి ఆఫర్‌ల కోసం వెతకగా.. అలాంటి ప్రమోషన్‌లు ఏవీ కనుగొనలేకపోయాము.మేము మరింత శోధించినప్పుడు, వాలెంటైన్స్ డే సందర్భంగా వాట్సాప్‌లో వైరల్ అయిన ఇలాంటి లింక్ లో ఎంత నిజం ఉందంటూ ట్విట్టర్ వినియోగదారు ప్రశ్నించగా, అది తమ బ్రాండ్ ద్వారా జారీ చేయలేదని తనిష్క్ స్పష్టం చేసింది.తనిష్క్ సంస్థ సమాధానంలో “ తనిష్క్ వాలెంటైన్స్ డే బహుమతిని అందించడం లేదని.. అందుకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వాటిలో ఏదీ తనిష్క్ బ్రాండ్ జారీ చేయలేదు. మేము కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నాము, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము." అని ఉంది.
మేము హూ-ఈజ్ డేటాబేస్‌లోని డొమైన్ వివరాలను తనిఖీ చేసినప్పుడు, ఈ డొమైన్ తనిష్క్ ద్వారా రిజిస్టర్ చేయలేదని తేలింది. దీనిని చైనాలోని ఫు జైన్ రిజిస్టర్ చేసింది.

 

దీన్ని బట్టి తనిష్క్ లోగోను ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతూ ఉన్నారని గుర్తించాం. లింక్ క్లిక్‌బైట్ వెబ్‌సైట్‌కి దారి తీస్తుంది, ఇది మాల్వేర్‌ను కలిగి ఉండవచ్చు, హ్యాకింగ్‌కు దారితీయవచ్చు. కాబట్టి, ఈ లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నాము. వైరల్ అవుతున్న దావా ఒక స్కామ్.
Claim :  Tanishq giving away gifts on women's day
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News