ఫ్యాక్ట్ చెక్: చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ అయిందని.. చంద్రుడి ఉపరితలంపై స్వచ్ఛమైన నీటిని కనుగొన్నట్లు వచ్చిన నివేదికలు తప్పు
చంద్రయాన్ -3 ఇంకా చంద్రునిపై ల్యాండ్ కాలేదు, ఇస్రో షెడ్యూల్ ప్రకారం, ఇది ఆగస్టు 23 న జరుగుతుంది.
చంద్రయాన్ -3 ఇంకా చంద్రునిపై ల్యాండ్ కాలేదు, ఇస్రో షెడ్యూల్ ప్రకారం, ఇది ఆగస్టు 23 న జరుగుతుంది.
చంద్రయాన్-3 జూలై 14న ప్రయోగించారు. ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అంతరిక్ష నౌక ‘చంద్రునిపై విజయవంతంగా దిగడం’, ‘చంద్రుని ఉపరితలంపై స్వచ్ఛమైన నీటిని కనుగొనడం’ గురించి ధృవీకరించని నివేదికలు ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి. చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిందని, అంచనా వేసిన షెడ్యూల్ కంటే చాలా ముందుగానే చంద్రుని ఉపరితలంపై స్వచ్ఛమైన నీటిని కనుగొన్నట్లు నెటిజన్లు పేర్కొన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్.. లేదా చంద్రుడి ఉపరితలంపై స్వచ్ఛమైన నీటిని కనుగొన్నట్లు అధికారిక నివేదిక ఏదీ రాలేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లేదా అధికారిక ప్రతినిధులు ఎవరూ ఈ వార్తలను ధృవీకరించలేదు.చంద్రయాన్-3 యొక్క ప్రస్తుత టైమ్‌లైన్ ను ఇస్రో స్పష్టంగా చూపిస్తోంది, అంతరిక్ష నౌక ఇంకా చంద్రునిపై దిగలేదు. చంద్రయాన్–3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఆగస్టు 14న ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. చంద్రుడుకి, వ్యోమనౌకకు మధ్య దూరం మరింత తగ్గింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 16వ తేదీన ఉదయం 8.30కి చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆరోజు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరనుంది. తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరుపడనుంది. ఈనెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఇస్రో తెలిపింది.
ఆగస్టు 6న చంద్రయాన్-3 చంద్రుని ఫుటేజ్ ను పంపించినట్లు ఇస్రో తెలిపింది. దీంతో చంద్రుడిపై చంద్రయాన్-3 ఇంకా దిగలేదని స్పష్టంగా తెలుస్తోంది.
హిందుస్థాన్ టైమ్స్ నివేదికలోని టైమ్‌లైన్ ప్రకారం.. చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం షెడ్యూల్ చేయబడిన తేదీ ఆగస్టు 23. “అంతా సరిగ్గా జరిగితే, అంతరిక్ష నౌక సాయంత్రం 5:47 గంటలకు చంద్రున్ని తాకే ప్రయత్నం చేయనున్నారు. చంద్రుని మీద పరిస్థితుల ఆధారంగా ల్యాండింగ్ ను సెప్టెంబర్‌కు రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది" అని కూడా ఇస్రో చెబుతోంది.
చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయి.. చంద్రుని ఉపరితలంపై స్వచ్ఛమైన నీటిని కనుగొన్నట్లు వచ్చిన వార్త అబద్ధమని స్పష్టమైంది.
Claim : Chandrayaan-3 has landed on the moon and discovered pure water on the moon’s surface
Claimed By : Social Media Users
Fact Check : False