ఫ్యాక్ట్ చెక్: టీడీపీ కూటమి ప్రభుత్వం 999 పవర్‌స్టార్ సుపీరియర్ విస్కీని విడుదల చేయలేదు.. ఇది చాలా కాలంగా మార్కెట్లో ఉంది
కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మద్యం పాలసీని సమీక్షించి, మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లను తక్కువ ధరకు అందించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో క్వాలిటీ మద్యం గురించి హామీ ఇచ్చారు.;
కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మద్యం పాలసీని సమీక్షించి, మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లను తక్కువ ధరకు అందించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో క్వాలిటీ మద్యం గురించి హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం రాష్ట్ర మద్యం పాలసీని తీసుకుని రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది.
సంకీర్ణ ప్రభుత్వం కొత్త బ్రాండ్ ఆల్కహాల్‌ను ప్రారంభించిందని పేర్కొంటూ '999 పవర్‌స్టార్ సుపీరియర్ విస్కీ' అనే మద్యం బ్రాండ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద జనాలను మెప్పించేందుకే ఈ విస్కీని లాంచ్ చేసారని విమర్శించారు.
‘పవర్ స్టార్ విస్కీ.. కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్! నాణ్యమైన మద్యం అంటూ జనసైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కార్’ అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మద్యం బ్రాండ్ 999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కొత్త మద్యం బ్రాండ్ కాదు. ఇది చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో మార్కెట్‌లో ఉంది.
మేము ‘999 పవర్‌టార్ సుపీరియర్ విస్కీ’ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ గురించి వెతికాం. క్విక్‌కంపెనీ, ట్రేడ్ మార్కింగ్.ఇన్ అనే వెబ్‌సైట్‌లలో ‘గ్రేట్ గాలియన్ లిమిటెడ్’ అనే కంపెనీ క్రింద ట్రేడ్‌మార్క్ చేశారని మేము కనుగొన్నాము.
మే 13, 2020న TV5 తెలుగు ప్రచురించిన YouTube వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో 2019లో YSRCP ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన కొత్త ఆల్కహాల్ బ్రాండ్‌ల గురించి ఉంది. వీడియోలోని యాంకర్ బ్రాండ్ పేరుని '999 పవర్ స్టార్ సుపీరియర్' అని చెప్పడం వినొచ్చు.
2022లో వైసీపీ ప్రభుత్వం పవర్ స్టార్ మద్యాన్ని ప్రవేశపెట్టిందని కూటమి మద్దతుదారులు ప్రభుత్వ నోటిఫికేషన్‌లను పంచుకున్న కథనం వెబ్‌దునియాలో ఉంది. వైఎస్‌ఆర్‌సిపి హయాంలోనే ఈ మద్యం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారని కథనంలో తెలిపారు.
999 పవర్‌స్టార్ విస్కీ చిత్రాన్ని 'డైలీ పోస్ట్ పంజాబీ'లో ప్రచురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. పంజాబ్‌లోని ఒక వ్యక్తి నుండి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ 999 పవర్‌స్టార్ విస్కీ బ్రాండ్ మద్యం 15 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నివేదించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘999 పవర్‌స్టార్ సుపీరియర్’ విస్కీని మార్కెట్ లోకి తీసుకుని వచ్చిందన్న వాదన తప్పు. '999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ' ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన కొత్త బ్రాండ్ కాదు. ఇది చాలా ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
Claim : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘999 పవర్‌స్టార్ సుపీరియర్’ విస్కీని విడుదల చేశారు
Claimed By : Social media users
Fact Check : False