ఫ్యాక్ట్ చెక్: తమిళనాడులో జరిగిన దొంగతనాన్ని టీటీడీ అధికారిణి ఇంట్లో ఐటీ దాడులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
వైరల్ వీడియోకు, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు;
వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల ముస్తాబవుతూ ఉంది. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తమ అత్యంత ప్రాధాన్యత అని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఏడు లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసిందని ఈవో వెల్లడించారు. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లు, తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో 4 కౌంటర్లలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేయనున్నారు.
జనవరి 10, 11, 12 తేదీల్లో భక్తులకు 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు.
అయితే వైసీపీ హయాంలో టీటీడీలో పని చేసిన ముస్లిం మహిళా అధికారిణి ముబీనా నిష్కా బేగం భారీ ఎత్తున నగలను దోచుకున్నారని, ఆమె ఇంట్లో సోదాలు చేసిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారంటూ వాట్సప్ లో మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ముస్లిం మహిళా అధికారిణి ముబీనా నిష్కా బేగం ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగలు
ఆయన పాలనలో ఆమె *తిరుపతి దేవస్థానం*లో ప్రజా సంబంధాల అధికారి.
ఇది విష్ణువుకు పూజలు చేసి సమర్పించిన భక్తుల నగలు.
ఈడీ కూడా రంగంలోకి దిగింది." అంటూ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
అయితే వైసీపీ హయాంలో టీటీడీలో పని చేసిన ముస్లిం మహిళా అధికారిణి ముబీనా నిష్కా బేగం భారీ ఎత్తున నగలను దోచుకున్నారని, ఆమె ఇంట్లో సోదాలు చేసిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారంటూ వాట్సప్ లో మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ముస్లిం మహిళా అధికారిణి ముబీనా నిష్కా బేగం ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగలు
ఆయన పాలనలో ఆమె *తిరుపతి దేవస్థానం*లో ప్రజా సంబంధాల అధికారి.
ఇది విష్ణువుకు పూజలు చేసి సమర్పించిన భక్తుల నగలు.
ఈడీ కూడా రంగంలోకి దిగింది." అంటూ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
ఇతర భాషల్లో కూడా ఇదే వాదనతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.
"ఇది నగల దుకాణం కాదు, జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లో పని చేసిన *ముబీనా నిష్కా బేగం* అనే అధికారిణి ఇల్లు, incomeTax Rides లో బయటపడిన నగలు.. ఇందులో తి.తి.దేవస్థానం కి చెందిన నగలు ఉన్నాయో లేవో it అధికారులు ఇంకా చెప్పలేదు." అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోకు తిరుమలకు ఎలాంటి సంబంధం లేదు.
ఇటీవలి కాలంలో ఎవరైనా టీటీడీకి చెందిన అధికారులపై ఐటీ రైడ్స్ జరిగాయా అనే విషయమై కథనాల కోసం వెతికాము. అయితే మాకు అందుకు సంబంధించి ఎలాంటి ఫలితాలు లభించలేదు. ఇలాంటి ఘటన నిజంగా జరిగి ఉంటే అది ఖచ్చితంగా వార్తల్లో ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు.
మా తదుపరి పరిశోధనలో భాగంగా వైరల్ వీడియోలోని విజువల్స్ ను స్క్రీన్ షాట్ తీసి మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం.
డిసెంబర్ 20, 2021న అదే విధంగా కనిపించే క్లిప్ మాకు ట్విట్టర్లో కనిపించింది. తమిళనాడు రాష్ట్రం వేలూరులోని జోస్ అలుక్కాస్ జ్యువెలరీ స్టోర్‌లోకి రంధ్రం చేసి దొంగతనం చేశారు. 15 కిలోలు బంగారం, వజ్రాల ఆభరణాలు దోచుకున్న దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పోస్టులో తెలిపారు.
దీన్ని క్యూ గా తీసుకుని మేము గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఈ దొంగతనాన్ని నివేదించాయి. 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఘటన చోటు చేసుకుందని మీడియా నివేదించింది.
వేలూరులోని ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లో 2021, డిసెంబర్ 15న జరిగిన చోరీని ఛేదించిన పోలీసులు ఒడుకత్తూరులోని ఓ శ్మశాన వాటికలో 15.9 కిలోల చోరీకి గురైన 8 కోట్ల రూపాయల విలువైన 15.9 కిలోల బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. తొట్టపాళయంలోని జోస్ అలుక్కాస్ షోరూమ్ సమీపంలోని వీధుల్లోని 200 ఫుటేజీలను విశ్లేషించి నిందితుడు వి.తీకారామన్ ను గుర్తించామని పోలీసులు తెలిపారు. పల్లికొండలోని కూచిపాలేనికి చెందిన తీకారామన్ దుకాణంలోకి ప్రవేశించేందుకు షోరూమ్ వెనుక గోడకు రంధ్రం చేసే ముందు షోరూమ్‌ను కొద్దిసేపు నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. తాపీ మేస్త్రీ అయిన ఇతనిపై ద్విచక్రవాహనం, ల్యాప్‌టాప్ చోరీ కేసులు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన నివేదికలను ఇక్కడ చూడొచ్చు.
వేలూరు జిల్లా పోలీసులను తమిళనాడు పోలీసు విభాగం అభినందిస్తూ ఎక్స్ లో పోస్టు కూడా పెట్టింది.
కాబట్టి, తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన వీడియోను తిరుమలకు చెందినదిగా ఆపాదిస్తున్నారు.
Claim : వైసీపీ హయాంలో టీటీడీలో పని చేసిన ముస్లిం మహిళా అధికారిణి ముబీనా నిష్కా బేగం ఇంట్లో ఐటీ దాడులు
Claimed By : Social Media Users
Fact Check : False