ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు టీటీడీ అనుమతిస్తుందనే ప్రచారం నిజం కాదు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇకపై టీటీడీ

Update: 2024-12-29 03:49 GMT

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోవాలని టీటీడీని పలువురు తెలంగాణ నేతలు కోరుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించకపోవడంపై పలువురు నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రస్ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా విమర్శలు చేశారు.


శ్రీవారి దర్శన భాగ్యం పొందడంలో తెలంగాణ భక్తులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టీటీడీ అంశాలపైన చర్చించారని వెల్లడించారు. గతంతో టీటీడీ తెలంగాణ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసేదని సురేఖ అన్నారు. ఇప్పుడు కూడా అలానే చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇంతలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త..
వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.








 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి నిర్ణయం తీసుకోలేదని మేము తెలుసుకున్నాం.

మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా టీటీడీ ఈవో ఇంకా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పినట్లుగా
కథనాలు
గుర్తించాం. డిసెంబర్ 28, 2024న డయల్ యువర్ ఈవో కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీవారి బ్రేక్ దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వారానికి రెండు సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు ఖండించారు. వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసామని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, విఐపీ బ్రేక్ దర్శనాలకు 10 రోజులు పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడదని, ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయిస్తామని చెప్పారు.

"తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ సిఫార్సు లేఖలపై ట్విస్ట్.. టీటీడీ ఈవో ఫుల్ క్లారిటీ" అంటూ సమయం వెబ్సైట్ లో కథనాన్ని కూడా మేము గుర్తించాం.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనం కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారని, తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో క్లారిటీ ఇచ్చారని సమయం కథనంలో ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిదుల లేఖలు స్వీకరిస్తారని కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అన్నారు.

ఇదే విషయాన్ని పలు తెలుగు మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ లో పోస్టు చేశారు. టీటీడీ ఈవో శ్యామల రావు స్వయంగా చెప్పిన విజువల్స్ ను మీరు చూడొచ్చు.

Full View


Full View


Full View


Full View


కాబట్టి, తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనం కేటాయింపుపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


Claim :  తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇకపై టీటీడీ అనుమతించబోతోంది
Claimed By :  Social Media Users, Media Channels
Fact Check :  False
Tags:    

Similar News