ఫ్యాక్ట్ చెక్: గతంలో వైరల్ అయిన ఒక వ్యక్తి కుక్కలా ప్రవర్తిస్తున్న వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు

ప్రభుత్వ అధికారి కారును ఓ వ్యక్తి ఆపి కుక్కలా మొరగడం వీడియోలో చూడొచ్చు. అతను కూడా కుక్కలా ప్రవర్తిస్తాడు. అతను అధికారికి

Update: 2024-12-25 07:00 GMT

Man barking

ప్రభుత్వ అధికారి కారును ఓ వ్యక్తి ఆపి కుక్కలా మొరగడం వీడియోలో చూడొచ్చు. అతను కూడా కుక్కలా ప్రవర్తిస్తాడు. అతను అధికారికి కొన్ని కాగితాలను అందజేస్తాడు. అలాగే కుక్కలా మొరుగుతూ ఉండిపోయాడు. 46 సెకన్ల నిడివి గల వీడియోను హిందీలో వైరల్ చేస్తున్నారు “అధికారులు జారీ చేసిన అతని రేషన్ కార్డులో ఆ వ్యక్తి ఇంటిపేరు ‘దత్తా’ స్థానంలో ‘కుత్తా’ అని ముద్రించారు. ఇందుకు సదరు వ్యక్తి అధికారుల ఎదుట కుక్కలా మొరగడం మొదలుపెట్టాడు." అని ఉంది. కుత్తా అంటే హిందీలో కుక్క అని అర్థం. “पश्चिम बंगाल के इस वायरल वीडियो पर क्या ही कहा जाए...पश्चिम बंगाल से सामने आए इस वायरल वीडियो ने हर किसी को सोचने पर मजबूर कर दिया है। #viralvideo” అనే టైటిల్ తో వీడియో వైరల్ అవుతూ ఉంది. “పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిన ఈ వైరల్ వీడియో గురించి ఏమి చెప్పగలం... ఈ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది. #వైరల్ వీడియో" అంటూ అర్థం వస్తుంది. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుందనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది



క్లెయిం కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు.


ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. 2022 సంవత్సరానికి చెందిన పాత వీడియో మళ్లీ సర్క్యులేషన్‌లో ఉంది. ఇది ఇటీవలి ఘటనగా చెబుతున్నారు.

మేము వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో 2022 సంవత్సరంలో సర్క్యులేషన్‌లో ఉందని మేము కనుగొన్నాము. తెలుగు టీవీకి చెందిన యూట్యూబ్ ఛానెల్, NTV నవంబర్ 20, 2022న అదే వీడియోను రేషన్ కార్డ్ లో తన ఇంటిపేరు "దత్తా బదులుగా కుత్తా" అని ఉండడంతో అతడు ఇలా చేశాడంటూ తెలిపారు. “Viral Video: Man Barks Like a Dog After His Surname "Dutta Printed as Kutta" on Ration Card l NTV” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

Full View
ఆజ్ తక్ ప్రచురించిన కథనం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా నివాసి ఒకరు 'కుక్క'లా మొరుగుతున్నాడు, కుక్కలా రెండు చేతులు, కాళ్ళతో నడుస్తూ, వాహనాలను వెంబడించాడు. ప్రజలను చూసి మొరుగుతాడు. కుక్కలా ప్రవర్తించే ఈ వ్యక్తి పేరు శ్రీకాంతి కుమార్ దత్తా. కుక్కలా ప్రవర్తించడానికి కారణం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

జీ న్యూస్‌లో ప్రచురించిన కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఒక వ్యక్తి రేషన్ కార్డ్‌లో తన ఇంటిపేరు 'దత్తా'కు బదులుగా 'కుత్తా' (కుక్క) అని తప్పుగా రాయడంతో స్థానిక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO)పై మొరుగుతూ కుక్కలా ప్రవర్తించాడు. విస్తృతంగా షేర్ చేసిన 45 సెకన్ల నిడివి గల వీడియోలో ఆ వ్యక్తి తన పత్రాలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తున్నప్పుడు కుక్కలా గట్టిగా మొరుగుతున్నట్లు చూడొచ్చు.ఫుల్‌ స్లీవ్‌ షర్ట్‌, ప్యాంట్‌ ధరించిన వ్యక్తి వీడియో అంతటా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను కారు కిటికీ ప్రక్కన నిలబడి, BDOకి పత్రాలను చూపిస్తూ కనిపించాడు, ఆ తర్వాత అధికారి వాటిని కూడా చూడడానికి మరొక వ్యక్తికి అందజేస్తాడు.

హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన 45 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి కారులో కూర్చున్న ప్రభుత్వ అధికారికి తన పత్రాలను అందజేస్తున్నప్పుడు కుక్కలా గట్టిగా మొరుగుతున్నట్లు చూడొచ్చు. రేషన్ కార్డులో ఇంటిపేరు తప్పుగా స్పెల్లింగ్ ఉందని చూపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ‘దత్తా’ అనే ఇంటిపేరుకు బదులుగా ‘శ్రీకంటి కుమార్ కుత్తా’ అని రాసినట్లు చూడవచ్చు. నివేదికల ప్రకారం, వ్యక్తి తన ఇంటిపేరు మార్చుకోవడానికి బంకురా అధికారులను అనేకసార్లు సహాయం కోరాడు కానీ ప్రతిసారీ అధికారుల నుండి అతడికి నిరాశ ఎదురైంది.

రేషన్‌కార్డులో తన ఇంటిపేరు దిద్దుబాటు కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు శ్రీకాంతి కుమార్ దత్తా వార్తా సంస్థ ANIకి తెలిపారు. ఈ పరిణామాలతో మానసికంగా ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పినట్లు సమాచారం.

మళ్లీ దిద్దుబాటు కోసం దరఖాస్తు చేయడానికి వెళ్లానని, "అక్కడ జాయింట్ BDOని చూడగానే, నేను అతని ముందు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాను" అని చెప్పారు. వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు, గతంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Claim :  కుక్క అనే అర్థం వచ్చేలా రేషన్‌కార్డుపై ఇంటిపేరు ముద్రించడంతో కోపం వచ్చి ఓ వ్యక్తి కుక్కలా ప్రవర్తించాడు.
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News