ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నవి గాజాలో పాఠశాలపై దాడి జరిపిన క్షిపణి అవశేషాలు కావు. మెడికల్ ఎక్విప్మెంట్ అది

జూన్ 8, 2024 ఉదయం, ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లోని అల్-నుసీరత్ శరణార్థి శిబిరం ప్రాంతంపై బాంబు దాడి చేశాయి. ఈ ఘోరమైన దాడుల్లో 270 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. మహిళలు, పిల్లలు సహా 700 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

Update: 2024-06-17 05:15 GMT

missile

జూన్ 8, 2024 ఉదయం, ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లోని అల్-నుసీరత్ శరణార్థి శిబిరం ప్రాంతంపై బాంబు దాడి చేశాయి. ఈ ఘోరమైన దాడుల్లో 270 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. మహిళలు, పిల్లలు సహా 700 మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాల ప్రకారం, అక్కడ ఉన్న నలుగురు బందీలను విడిపించేందుకు ఈ దాడి జరిగింది.

ఈ దాడి తర్వాత, గాజాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపిందని.. క్షిపణి అవశేషాలను చూపించే ఒక వీడియోలో కొన్ని పరికరాలను చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. క్షిపణిపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని ఉందని సందేశంలో పేర్కొన్నారు.

ఈ క్షిపణి దాడుల్లో భారత్ ప్రమేయం ఉందనే వాదన కూడా మొదలైంది. వందలాది మంది పౌరులను చంపిన దాడిలో భారతదేశం ప్రమేయం ఉందని.. ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేయడంలో భారతదేశం పాత్ర గురించి అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు కథనాలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

వీడియోతో పాటుగా షేర్ చేసిన క్యాప్షన్ లో "మేడ్ ఇన్ ఇండియా" అని ఉంది. గత రాత్రి నుసిరత్ శరణార్థి శిబిరంలోని UN క్యాంపు వద్ద ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జారవిడిచిన క్షిపణి అవశేషాలపై మేడ్ ఇన్ ఇండియా లేబుల్‌ ఉంది.




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది నుసిరత్ శరణార్థి శిబిరంపై దాడికి ఉపయోగించిన క్షిపణి అవశేషాలు కాదు.

మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను సెర్చ్ చేయగా.. మేము UL ఇండియా (వైద్య పరికరాల ధృవీకరణ సంస్థ)కు సంబంధించిన లోగోను చూడవచ్చని పేర్కొంటూ Xలో ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. ఈ అవశేషాలు గాజాకు విరాళంగా అందించిన వైద్య పరికరాలు తప్ప.. క్షిపణులు కాదు.
వైరల్ వీడియో నుండి తీసుకున్న స్క్రీన్‌షాట్‌లను నిశితంగా పరిశీలించిన తర్వాత, శిధిలాలలో USతో పాటు UL అనే లోగో ఉన్నట్లు మేము కనుగొన్నాము. తదుపరి పరిశోధనలో UL అంటే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కంపెనీ అయిన అండర్ రైటర్ లాబొరేటరీస్ అని మేము కనుగొన్నాము. UL అనేది ఇండియన్ సర్టిఫికేషన్ ఫర్ మెడికల్ డివైసెస్ (ICMED) 13485 స్కీమ్ కింద ఒక సర్టిఫికేషన్ బాడీ, ఇది భారతదేశంలోని వైద్య పరికరాల కోసం స్వచ్ఛంద నాణ్యత ధృవీకరణ పథకం.
UL సొల్యూషన్స్
వైద్య పరికరాల తయారీదారుల కోసం థర్డ్-పార్టీ రెగ్యులేటరీ అప్రూవల్స్, ఉత్పత్తికి సంబంధించిన పరీక్షలు, ధృవీకరణ, ఆడిటింగ్, సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్ లతో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది.

UL ద్వారా వైద్య పరికరాల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు.

క్షిపణిని భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు వచ్చిన వార్తలను భారతదేశం లేదా ఇజ్రాయెల్ అధికారులు ఖండించలేదు లేదా ధృవీకరించలేదు. మాకు అందుకు సంబంధించి నివేదికలు ఏవీ దొరకలేదు. అందువల్ల, వైరల్ వీడియో గాజాలో క్షిపణి అవశేషాలకు సంబంధించినది కాదు. ఆ అవశేషాలు భారతదేశంలో ఉన్న UL అనే కంపెనీ ధృవీకరించిన వైద్య పరికరాలకు చెందినవి. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  సెంట్రల్ గాజాలోని నుసిరత్ శిబిరంలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న ఐక్యరాజ్యసమితి పాఠశాలపై ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచిన క్షిపణి అవశేషాలను వీడియోలో చూడొచ్చు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News