ఫ్యాక్ట్ చెక్: ఒక వ్యక్తి సరస్వతీ దేవి చిత్రపటాన్ని తన్నిన వీడియో తప్పుడు వాదనతో వైరల్ అవుతోంది
ఓ వ్యక్తి ఆగ్రహంతో సరస్వతీ దేవి చిత్రపటాన్ని తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మతం రంగు పులిమి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఓ వ్యక్తి ఆగ్రహంతో సరస్వతీ దేవి చిత్రపటాన్ని తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మతం రంగు పులిమి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఒక పాఠశాలలో ఒక వ్యక్తి ఆవేశంతో సరస్వతీ దేవి చిత్రపటాన్ని తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ముస్లిం అని, హిందూ దేవత చిత్రపటాన్ని తన్నుతున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.
సరస్వతి మాత చిత్ర పటాన్ని కాలుతో తన్నిన ఈ జిహాదీని వదలకూడదనే క్యాప్షన్‌తో వీడియో షేర్ అవుతోంది.
"ನಮ್ಮ ದೇವರು ಸರಸ್ವತಿಯನ್ನು ಕಾಲಿನಿಂದ ಒದ್ದ ಈ ಜಿಹಾದಿಯನ್ನು ಸುಮ್ನೆ ಬಿಡಬಾರದು ಬೋಸುಡಿಮಗನಿಗೆ ಸೂಳೇಮಗನಿಗೆ ಒದ್ದು ಪಾಕಿಸ್ತಾನಕ ಕಳಸಬೆಕು ರಂಡಿಮಗನಿಗೆ .. ತಮ್ಮ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದರೆ "ಸರ್ ತನ್ ಸೇ ಜುದಾ" ಮಾಡುವ ಭಯಉತ್ಪಾದಕರು.. ಆ ದೇವರೇ ಇವನ ಕಾಲನ್ನು ತನ್ ಸೇ ಜುದಾ ಮಾಡುತ್ತಾರೆ..
ಜೈ ಶ್ರೀರಾಮ್ " అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోలో.. వీడియోలో ఉన్న వ్యక్తి, వీడియో షూట్ చేసిన వ్యక్తి గుజరాతీలో మాట్లాడుకుంటూ ఉండడాన్ని మనం వినవచ్చు. దీన్ని సూచనగా తీసుకుని, మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. YouTubeలో పూర్తి వీడియోను కనుగొన్నాము. ABP అస్మిత నివేదికలో ఈ సంఘటన గురించి వివరంగా చెప్పుకొచ్చారు.
నివేదిక ప్రకారం, వీడియోలోని వ్యక్తి గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లా నస్వాడీలో ఉన్న గెలేసర్ ప్రైమరీ స్కూల్‌లో గెస్ట్ లెక్చరర్ అయిన యోగేష్ రత్వా. ఈ సంఘటన డిసెంబర్ 28, 2022న చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యోగేష్ రత్వా, సరస్వతి చిత్రపటాన్ని తన్నాడు. అనంతరం పాఠశాల నిర్వాహకుల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ABP న్యూస్ గుజరాతి, ఆజ్ తక్, న్యూస్ 18 గుజరాత్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాయి.
ABP న్యూస్ గుజరాతి, ఆజ్ తక్, న్యూస్ 18 గుజరాత్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాయి.
నివేదికల ప్రకారం ఆ వ్యక్తి పూర్తి పేరు యోగేష్ రాత్వా అని తెలిపారు. అతను ముస్లిం కాదని ఈ ఘటనలో ఎటువంటి మతపరమైన వాదన లేదని స్పష్టంగా తెలుస్తోంది.
అంతేకాకుండా, ఛోటాడేపూర్ ఎస్పీ ధర్మేంద్ర శర్మ ఒక మీడియా సంస్థకు వైరల్ వాదనలో ఎటువంటి నిజం లేదని చెబుతూ వివరణ ఇచ్చారు. వీడియోలో ఉన్న వ్యక్తిని యోగేష్ రాత్వాగా గుర్తించారు, అతను హిందూ వ్యక్తి.. ముస్లిం వర్గానికి చెందినవాడు కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim : Muslim man kicks goddess Saraswati's portrait in rage at a school
Claimed By : Twitter Users
Fact Check : False