ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తి రాడ్డుతో దాడి చేస్తున్న వైరల్ వీడియోలో ఎటువంటి మత కోణం లేదు

స్కల్ క్యాప్ ధరించిన వ్యక్తి మరొక వ్యక్తిపై రాడ్‌తో దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. హిందువులను చంపడం వారి లక్ష్యం. వారి మత గ్రంధాలు చెప్పినట్లు భారతదేశంలోని హిందూ సమాజానికి చెందిన వ్యక్తిపై దాడి చేస్తున్నారనే వాదనతో ప్రచారంలో ఉంది.

Update: 2023-05-25 05:53 GMT

స్కల్ క్యాప్ ధరించిన వ్యక్తి మరొక వ్యక్తిపై రాడ్‌తో దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. హిందువులను చంపడం వారి లక్ష్యం. వారి మత గ్రంధాలు చెప్పినట్లు భారతదేశంలోని హిందూ సమాజానికి చెందిన వ్యక్తిపై దాడి చేస్తున్నారనే వాదనతో ప్రచారంలో ఉంది.

“మీ పక్కనే తురకల ఉంటారు జాగ్రత్త. హిందువులను చంపడమే వారి అంతిమ లక్ష్యం.. వాళ్ళ మత గ్రంధం అలానే చెబుతుంది. వాళ్ళు చేస్తారు. మన హిందువుల ఐక్యత దరిద్రం చూడు ఎలా ఉంది కొట్టిన వాడిని ఎవడు పట్టించుకుంటలేరు కొట్టి దర్జా గా పొతుండ్ ” అంటూ పోస్టులు పెడుతున్నారు.

https://www.facebook.com/100089322637244/videos/751512853127697

https://www.facebook.com/100074412602645/videos/1104342274289806

ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ ఘటన భారతదేశంలో జరిగిందన్న వాదన అవాస్తవం. ఈ ఘటన 2021లో శ్రీలంకలో జరిగింది.

జాగ్రత్తగా గమనించగా.. వీడియోలో వినిపించే భాష సింహళీ అని మేము కనుగొన్నాము. మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.. ఆ వీడియో 2021 ఫిబ్రవరిలో సింహళీస్ భాషలో Facebookలో పోస్ట్ చేయబడిందని మేము కనుగొన్నాము. శ్రీలంకలోని గలాహా ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని వైరల్ పోస్ట్ పేర్కొంది.

https://www.facebook.com/DriveSafely1st/posts/785412689077403

ఫాక్ట్ క్రెసెండో శ్రీలంక ప్రకారం ఈ సంఘటన సెంట్రల్ ప్రావిన్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, ముస్లిం వ్యక్తి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని, గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందించామని శ్రీలంక పోలీసులు నివేదించారు.

కాబట్టి, ఈ వీడియో ఇటీవలిది కాదు. అదీ కాకుండా భారతదేశానికి సంబంధించినది కాదు. ఇది 2021లో శ్రీలంకలో జరిగింది. వీడియోలో దాడి చేసిన వ్యక్తి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న వ్యక్తి. ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Claim :  Muslim man attacking a man in India
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News