ఫ్యాక్ట్ చెక్: అది సినిమా షూటింగ్ వీడియో.. నిజంగా చోటు చేసుకుంది కాదు
నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన ఒక రిపోర్టర్‌ను పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై 'కిడ్నాప్' చేసినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో పట్టపగలు కిడ్నాప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన ఒక రిపోర్టర్‌ను పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై 'కిడ్నాప్' చేసినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది నిజమైన సంఘటన అని నమ్మి నెటిజన్లు ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. "దిమాపూర్‌లో పట్టపగలు రిపోర్టర్ కిడ్నాప్ అయ్యాడు" అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
https://www.facebook.com/reel/
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ సన్నివేశం భోజ్‌పురి సినిమా హమ్ హై రౌడీ ఎస్పీ విజయ్‌లోనిది అని వైరల్ పోస్టులోని కామెంట్స్ కింద మనం చూడొచ్చు. వినియోగదారులు చెప్పిన చిత్రానికి సంబంధించిన లింక్ కూడా ఉంది.
లింక్‌ను చూసిన తర్వాత, సినిమాలోని విజువల్స్ వైరల్ కిడ్నాప్ వీడియోతో సరిపోలుతున్నట్లు మేము కనుగొన్నాము. 8:38 టైమ్‌స్టాంప్ వద్ద, ఒక రిపోర్టర్ రోడ్డు మధ్యలో నిలబడి ఉండగా.. కాసేపటికి, తెల్లటి ఓమ్నీ కారు ఆమె వెనుకకు వచ్చింది. డోర్ తెరిచిన తర్వాత అందులోని వ్యక్తులు ఆమెను కారు లోపలికి లాగేశారు. కెమెరామెన్ వాహనం వెంట పరుగెత్తాడు. ఇదంతా వైరల్ వీడియోలో కనిపించే 'కిడ్నాప్' సీన్‌తో సరిపోలుతుందని స్పష్టంగా కనిపిస్తోంది.
గూగుల్ మ్యాప్‌ల సహాయంతో, నాగాలాండ్‌లోని దిమాపూర్‌లోని సిటీ టవర్ వద్ద షూటింగ్ జరిగిందని నిర్ధారించగలిగాము.
నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఒక రిపోర్టర్ కిడ్నాప్‌కు చేసిన వీడియో.. సినిమాలో భాగంగా జరిగింది. ఇది నిజమైన కిడ్నాప్ సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు.
Claim : Reporter kidnapped in Dimapur, Nagaland.
Claimed By : Facebook Users
Fact Check : False