ఫ్యాక్ట్ చెక్ : బోధన్ లో జరిగిన గొడవకు సంబంధించి పెద్ద ఎత్తున హిందూ గ్రూప్ సభ్యులు తరలి వస్తున్నారా..?
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఇటీవల ఇరు వర్గాల మధ్య గొడవలు జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
క్లెయిమ్: బోధన్ లోకి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా హిందూ గ్రూప్ సభ్యులు తరలి వస్తున్నారా
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. వీడియో 2020 నుండి వైరల్ అవుతూ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఇటీవల ఇరు వర్గాల మధ్య గొడవలు జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనపై రెండు గ్రూపులు గొడవకు దిగాయి. ఈ ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్టు చేశారు. మార్చి 20, ఆదివారం నిజామాబాద్‌లోని బోధన్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మహారాష్ట్ర నుండి బోధన్‌కు వెళ్లే మార్గంలో హిందూ సమూహాలు వస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "మహారాష్ట్ర నుండి వేలాది మంది హిందూ సోదరులు బోధన్‌కు వస్తున్నారు" అని ఒక పోస్ట్ ను అప్లోడ్ చేశారు. "బోధన్ లో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణని అడ్డుకొని హిందువులపై జరిగిన దాడికి గాను యావత్ హిందూ జాతి ఐక్యం అవుతుంది.మహారాష్ట్ర నుండి వేల సంఖ్యల్లో హిందూ సోదరులు బోధన్ చేరుకుంటున్నారు. సంఘటన్ మే హి శక్తి హై" అని ఉన్న పోస్టులు కూడా పలువురు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని గుర్తించారు. ఈ వీడియో 2020 నుండి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.మహారాష్ట్ర నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి శివాజీ అనుకూల గ్రూపులు వస్తున్నాయనే నివేదికల గురించి తనిఖీ చేశాము. అయితే మేము దీనికి సంబంధించి ఏమీ కనుగొనలేదు. మాకు కనిపించిన కథనాలన్నీ బోధన్‌లోని పరిస్థితికి సంబంధించినవే.
వీడియో కీఫ్రేమ్‌ల గురించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 2020లో శివాజీ జయంతి వేడుకల సందర్భంగా మహారాష్ట్రలోని నంద్‌గావ్‌లో వీడియో చిత్రీకరించినట్లు చెబుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు.
"SHIV JAYANTHI UTSAW (NANDGAON)," అనే టైటిల్ తో వీడియోను ఫిబ్రవరి 27, 2020న అప్లోడ్ చేశారు.
మార్చి 14, 2020న అప్‌లోడ్ చేయబడిన మరో వీడియోలో "Nandgaon bike rally for shiv jayanti," పేరుతో ఉంది.
YouTubeలో కీవర్డ్స్ గురించి శోధించాము. Googleలో అదే వీడియోకు సంబంధించి మరికొన్ని వెర్షన్‌లను కనుగొన్నాము. శివాజీ జయంతి ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. ఈ వీడియోలు వీడియోలు ఫిబ్రవరి 19, 2020 తర్వాత రోజులలో అప్‌లోడ్ చేయబడ్డాయని మేము ధృవీకరించాము.
మేము వీడియో మూలాలను గుర్తించడానికి మరాఠీ, ఆంగ్లంలో కీవర్డ్‌ల సెర్చ్ ను ఉపయోగించడమే కాకుండా.. వీడియో కీఫ్రేమ్‌లకు సంబంధించి మరొక రౌండ్ రివర్స్ సెర్చ్ ను నిర్వహించాము. అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము.
తెలంగాణ బోధన్‌లో శివాజీ విగ్రహం గురించి జరిగిన గొడవతో.. ఈ బైకర్ల వీడియోకు సంబంధం లేదని నిర్ధారించాము.
క్లెయిమ్: బోధన్ లోకి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా హిందూ గ్రూప్ సభ్యులు తరలి వస్తున్నారా
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Pro-Shivaji bikers en route to Telangana's Bodhan from Maharashtra following the controversy over the installation of the king's statue.
Claimed By : Social Media Users
Fact Check : False