ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న ఫోటో తెలంగాణ తల్లిది కాదు.. సోనియా గాంధీ విగ్రహం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫిబ్రవరి 4, 2024న కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించేలా ‘TS’ స్థానంలో ‘TG’ని తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫిబ్రవరి 4, 2024న కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించేలా ‘TS’ స్థానంలో ‘TG’ని తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ ప్రభుత్వ చిహ్నాలలో కూడా మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తల్లి కాకుండా.. తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకొస్తామని తెలిపారు. గ్రామీణ శ్రామికురాలిగా లేదా విప్లవ యోధురాలు తరహాలో అందరికి తల్లిగా అభివర్ణించే విధంగా మార్పులు రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లి అనగానే.. తలపై కిరీటం, ఒక చేతిలో మొక్కజొన్న కంకులు పట్టుకుని, మరో చేతిలో బతుకమ్మను పట్టుకుని ఉన్న విగ్రహమే మదిలో మెదలుతుంది. కాంగ్రెస్ ఎలాంటి విగ్రహాన్ని తీసుకుని వస్తుందా అని ప్రజల్లో ఓ చిన్న సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.
ఈ నిర్ణయం తర్వాత, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కొత్త తెలంగాణ తల్లి అంటూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పోలి ఉండే చిత్రాన్ని పంచుకుంటున్నారు.
ఎన్‌డిటివికి సంబంధించిన వీడియో క్లిప్‌ను వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
ఈ నిర్ణయం తర్వాత, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కొత్త తెలంగాణ తల్లి అంటూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పోలి ఉండే చిత్రాన్ని పంచుకుంటున్నారు.
ఎన్‌డిటివికి సంబంధించిన వీడియో క్లిప్‌ను వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వైరల్ పోస్టుల్లో 2017లో తెలంగాణలో ఏర్పాటు చేసిన సోనియా గాంధీ విగ్రహం ఉంది.మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వైరల్ ఇమేజ్‌ని సెర్చ్ చేయగా, అది తెలంగాణలో నిర్మించిన ఆలయంలో సోనియా గాంధీ విగ్రహం అని కనుగొన్నాము.
2014లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చెబుతూ వస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. తెలంగాణలోని మల్లియాల్ అనే పట్టణంలో ఒక ఆలయాన్ని నిర్మించారు అందులో సోనియా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు సోనియా గాంధీకి మందిరాన్ని నిర్మించారు. ప్రతి రోజూ ప్రార్ధనలు చేసేందుకు వీలుగా తెల్లని పాలరాయితో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం బయట గోడలపై ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చిత్ర పటాలను కూడా ఉంచారు.
విగ్రహ ప్రతిష్ట వీడియోను జనవరి 8, 2014న NDTV ప్రచురించింది.
కాబట్టి, వైరల్ చిత్రంలో ఉన్నది కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కాదు. కానీ తెలంగాణలోని మల్లియల్‌లో నిర్మించిన ఓ ఆలయంలో సోనియా గాంధీ విగ్రహానికి సంబంధించినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : The image shows a new statue of Telangana Talli
Claimed By : Twitter users
Fact Check : Misleading