ఫ్యాక్ట్ చెక్: మంచు అచ్చం పూలలాగా ఏర్పడినట్లు ఉన్న ఫోటోలు ఏఐ ద్వారా సృష్టించినవి
పుష్పాల ఆకారంలో మంచు కనిపించిందని.. శీతాకాలం సమయంలో చైనాలోని నదుల దగ్గర ఇలా కనిపించిందంటూ పలువురు ఫోటోలను షేర్ చేస్తున్నారు.
పుష్పాల ఆకారంలో మంచు కనిపించిందని.. శీతాకాలం సమయంలో చైనాలోని నదుల దగ్గర ఇలా కనిపించిందంటూ పలువురు ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈశాన్య చైనాలోని సాంగ్హువా నదిపై ఏర్పడిన మంచు పువ్వులు ఇవి.. అంటూ కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్ ప్రాంతంలో మంచు పువ్వుల ఆకారంలో కనిపిస్తూ ఉంది. ఇది ఒక అందమైన దృశ్యానికి కారణం అవుతుంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మంచు పొర కింద ఉన్న గడ్డకట్టని నీరు పైకి వచ్చే సమయంలో చిన్న.. చిన్న.. పగుళ్లు ఏర్పడుతాయి. అప్పుడు, ఈ పగుళ్ల ద్వారా చాలా తక్కువ నీరు ప్రవహిస్తుంది.. అలా బయటకు వచ్చిన నీరు వెంటనే ఘనీభవిస్తుంది.. చాలా సన్నని మంచు పొరలు ఏర్పడతాయి. అవి అలా పేరుకుపోయినప్పుడు, అద్భుతమైన ఆకృతులను సృష్టిస్తాయి.
ఈ చిత్రాలు జనవరి 2023లో NDTV వంటి ప్రధాన స్రవంతి మీడియా ద్వారా కూడా వైరల్ అయ్యాయి. ఈ చిత్రాలు జనవరి 2023లో కూడా వైరల్ అయ్యాయి.. మళ్లీ జనవరి 2024లో ప్రచారంలో ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాలను AI ద్వారా రూపొందించారు.మేము సాంగ్హువా నదిపై మంచు పువ్వుల కోసం వెతికినప్పుడు, NE చైనాలోని హీలాంగ్‌జియాంగ్‌లోని సాంగ్‌హువా నది ఉపరితలాన్ని కప్పి ఉంచే "ఫ్రాస్ట్ ఫ్లవర్స్" అనే శీర్షికతో డిసెంబర్ 2022లో షేర్ చేసిన పీపుల్స్ డైలీ అనే చైనా ఫేస్‌బుక్ పేజీని మేము కనుగొన్నాము.
‘ఈజ్ ఇట్ AI’, 'ఇల్యూమినార్టీ' వంటి AI డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి వైరల్ ఇమేజ్‌లను చెక్ చేసినప్పుడు, ఆ ఇమేజ్‌లు AI-జెనరేట్ చేయబడినవి అని మేము కనుగొన్నాము.
ఈ క్లెయిమ్‌ను జనవరి 2024లో Snopes.com కూడా ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఈ చిత్రాలు AI ద్వారా రూపొందించినవేనని మేము నిర్ధారించాం.
అందువల్ల, వైరల్ చిత్రాలలోని ఆకారాలు సహజమైనవి కావు. అయితే AI ద్వారా రూపొందించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral images shared show ice flowers in the Songhua River in Northeast China
Claimed By : Social media users
Fact Check : False