ఫ్యాక్ట్ చెక్: ఈ మూడు దశల ద్వారా క్యాన్సర్ ను నయం చేయలేము
శరీరంలో క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి 3 దశలను వివరిస్తున్న ఓ వైద్యుడి చిత్రంతో పాటు.. ఓ సుదీర్ఘ సందేశం వైరల్ అవుతోంది. చక్కెర తీసుకోవడం మానేయడం, నిమ్మరసం తీసుకోవడం, ఆర్గానిక్ కొబ్బరి నూనెను రోజుకు మూడుసార్లు తీసుకుంటే క్యాన్సర్ నయం అవుతుందని అందులో పేర్కొన్నారు.
శరీరంలో క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి 3 దశలను వివరిస్తున్న ఓ వైద్యుడి చిత్రంతో పాటు.. ఓ సుదీర్ఘ సందేశం వైరల్ అవుతోంది. చక్కెర తీసుకోవడం మానేయడం, నిమ్మరసం తీసుకోవడం, ఆర్గానిక్ కొబ్బరి నూనెను రోజుకు మూడుసార్లు తీసుకుంటే క్యాన్సర్ నయం అవుతుందని అందులో పేర్కొన్నారు.
డాక్టర్ గుప్తా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారని చెప్పుకొచ్చారు. "డా. గుప్తా ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదనే ఉద్దేశ్యంతో ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. (1). మొదటి దశ చక్కెర తీసుకోవడం మానివేయడం, మీ శరీరంలో చక్కెర లేకపోతే క్యాన్సర్ కణాలు చనిపోతాయి. (2). రెండవ దశ ఒక కప్పు వేడి నీటిలో నిమ్మరసం కలపండి. 1-3 నెలల పాటు త్రాగాలి, మేరీల్యాండ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, ఇది కీమోథెరపీ కంటే 1000 రెట్లు మెరుగైనది. (3). మూడవ దశ ఏమిటంటే, 3 చెంచాల సేంద్రీయ కొబ్బరి నూనెను త్రాగడం, ఉదయం, రాత్రి అలా చేస్తే క్యాన్సర్ మాయమవుతుంది, మీరు చక్కెరను నివారించిన తర్వాత రెండు చికిత్సలలో దేనినైనా ఎంచుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ” అంటూ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ సందేశం ఒక బూటకం. మేము చిత్రాన్ని ఉపయోగించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. ఈ సందేశం 2018లో కూడా వైరల్ అయినట్లు మేము కనుగొన్నాము. మేము డాక్టర్ గుప్తా పేరును ఉపయోగించి వెతకగా.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఫలితాలను పొందలేకపోయాము.
మొదటి వాదన: చక్కెరను తగ్గించడం
క్యాన్సర్ రీసెర్చ్ UK ప్రకారం క్యాన్సర్ కణాలు త్వరగా పెరుగుతాయని. ఎంతో వేగంగా పెరిగిపోతాయి. 'షుగర్-ఫ్రీ' డైట్‌ని అనుసరించడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్‌లతో పరిమితం చేయబడిన ఆహారాన్ని కఠినంగా అనుసరించడం వల్ల ఫైబర్, విటమిన్లు శరీరానికి తగినంత అందకుండా పోతాయి. దీంతో దీర్ఘకాలికంగా ఆరోగ్యం దెబ్బతింటుందని పరిశోధన పేర్కొంది.
రెండవ వాదన: నిమ్మకాయ క్యాన్సర్‌ను నయం చేస్తుంది
ఈ వాదనను US నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ రీసెర్చ్ గతంలోనే తోసిపుచ్చింది. నిమ్మకాయలు అన్ని రకాల క్యాన్సర్‌లకు నిరూపితమైన ఔషధం కాదని.. నిమ్మకాయల ప్రభావాన్ని ఏకంగా కీమోథెరపీతో పోల్చడానికి ఎటువంటి అధ్యయనాలు జరగలేదని పేర్కొంది.
మూడవ వాదన: కొబ్బరి నూనెను తాగడం/తీసుకోవడం
https://www.ncbi.nlm.nih.gov/
కొబ్బరి నూనె ఒక అద్భుత ఆహారం కాదని అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ హెచ్చరించింది.
అందువల్ల వైరల్ పోస్ట్‌లోని వాదనలకు ఎటువంటి శాస్త్రీయ పరిశోధన మద్దతు లేదు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలను గుడ్డిగా నమ్మకండి.Claim : Cancer can be cured using tips from the message
Claimed By : Social Media Users
Fact Check : False