ఫ్యాక్ట్ చెక్: హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిని కొడుతున్నారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.. ఆ వీడియో ఇండోనేషియాకు సంబంధించినది.
కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని కొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 29 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వైరల్ అవుతూ ఉంది
కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని కొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 29 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వైరల్ అవుతూ ఉంది. భారతదేశంలో హిందూ అబ్బాయిలు బురఖా ధరించిన ముస్లిం అమ్మాయిని కొడుతున్నారు. వారు సంఘీ (హిందూ అనుకూల) మనస్తత్వంతో ఉన్నారు. హిజాబ్ ధరించినందుకు ఆ అమ్మాయిని దారుణంగా కొట్టారు.
ఇదే వీడియో హిందీలో పెట్టిన పోస్టుల ద్వారా కూడా వైరల్ అయింది. “ये किसी कॉलेज का वीडियो है , और ये ऐसा कॉलेज है जहां हिंदू लड़के लड़कियां साथ पढ़ाई करते हैं, यहां देखिए हिजाब वाली लड़कियों के साथ कैसा बर्ताओ करता है संघी मानसिकता वाले लड़के , किया अब भी आप अपनी बहन बेटी का एडमिशन ऐसे कॉलेज में करना पसंद करेंगे जहां हिंदू लड़के लड़कियां साथ पढ़ाई करते हैं “ అంటూ పోస్టులు పెట్టారు.
“ఇది ఏదో కాలేజీ నుండి వచ్చిన వీడియో, హిందూ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకునే కాలేజీ. హిజాబ్ ధరించిన అమ్మాయిలతో సంఘీ మనస్తత్వం ఉన్న అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ చూడండి. హిందూ అబ్బాయిలు.. అమ్మాయిలు కలిసి చదువుకునే కాలేజీలో మీ చెల్లి, కూతురికి ఇంకా అడ్మిషన్ ఇప్పిస్తారా?” అంటూ అందులో చెప్పుకొచ్చారు.
“ఇది ఏదో కాలేజీ నుండి వచ్చిన వీడియో, హిందూ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకునే కాలేజీ. హిజాబ్ ధరించిన అమ్మాయిలతో సంఘీ మనస్తత్వం ఉన్న అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ చూడండి. హిందూ అబ్బాయిలు.. అమ్మాయిలు కలిసి చదువుకునే కాలేజీలో మీ చెల్లి, కూతురికి ఇంకా అడ్మిషన్ ఇప్పిస్తారా?” అంటూ అందులో చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వీడియో ఇండోనేషియాకు చెందినది. అది కూడా 2020 సంవత్సరం నాటిది.
వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లను Google ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఇండోనేషియా వెబ్‌సైట్‌లు ప్రచురించిన అనేక వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
మేము jabar.tribunnews.comలో ఒక కథనాన్ని కనుగొన్నాము, ఇక్కడ అసలు YouTube వీడియోను కూడా పోస్టు చేశారు. ఇండోనేషియాలోని ఒక ఉన్నత పాఠశాలలో ఈ వీడియోను చిత్రీకరించారని వీడియో ద్వారా మనం గుర్తించవచ్చు.
Suara.com ప్రకారం, సెంట్రల్ జావాలోని పుర్వోరెజో రీజెన్సీలోని ఒక ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఒక విద్యార్థినిని వేధించారు. బాలిక మహమ్మదియా మిడిల్ స్కూల్‌లో చదువుతున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, వీడియోలో కనిపిస్తున్న అబ్బాయిలను అధికారులు అరెస్ట్ చేశారు.
bogor.Tribunnews.com ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరి 13, 2020న చోటు చేసుకుంది. ఈ వీడియోను మొదట ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసారు. వీడియో వైరల్ అయింది. ఇందులో అబ్బాయిలు హిజాబ్‌లో ఉన్న అమ్మాయిని కొట్టడం, తన్నడం మనం చూడవచ్చు. ఇండోనేషియాలోని పుర్వోరెజోలోని మహమ్మదియా స్కూల్‌లో ఈ ఘటన జరిగినట్లు పుర్వోరెజో డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆండీస్ అర్ఫాన్ తోఫానీ ధృవీకరించారు.
హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయిలు కొడుతున్నారని వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన వెనుక మతపరమైన కోణం లేదు. వీడియో 2020లో చిత్రీకరించారు. ఇండోనేషియాలో జరిగిన ఘటన. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Viral video shows Hindu boys bullying and beating a hijab-clad Muslim girl in a college in India
Claimed By : Social media users
Fact Check : False