ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది ఛత్తీస్‌గఢ్ ఎస్.డి.ఎం. కాదు.. సీఎం జగన్ కేబినెట్ లోని మంత్రి
ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు ఎంపీ స్థానాలకు మే 7, 2024న ఓటింగ్ నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్, కోర్బా, రాయ్‌గఢ్, జంజ్‌గిర్ చంపా, సర్గుజా లోక్‌సభ స్థానాలకు మొత్తం 168 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు ఎంపీ స్థానాలకు మే 7, 2024న ఓటింగ్ నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్, కోర్బా, రాయ్‌గఢ్, జంజ్‌గిర్ చంపా, సర్గుజా లోక్‌సభ స్థానాలకు మొత్తం 168 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన SDM నికితా సింగ్ మసీదును సందర్శించి అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మసీదు నిర్మించడానికి భూమిని ఇవ్వడమే కాకుండా నమాజ్ సమయంలో మసీదును సందర్శించారనే వాదనతో పోస్టులు పెడుతున్నారు.
“इस नफ़रत भरे माहौल में एक मोहब्बत भरा पैगाम "छत्तीसगढ़ की dear SDM निकिता सिंह ने मस्जिद के लिए दी जगह और उस जगह पर नमाज भी पढवाई। हमारे देश की खूबसूरती यहीं तो है धन्यवाद SDM निकिता जी “ అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
అనువదించగా “ఈ ద్వేషపూరిత వాతావరణంలో ప్రేమ సందేశం: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన SDM నికితా సింగ్ మసీదు కోసం భూమిని ఇచ్చారు. ఆ స్థలంలో నమాజ్ కూడా చేశారు. మన దేశ సౌందర్యం ఇక్కడే ఉంది. ధన్యవాదాలు SDM నికితా జీ” అని అర్థం వస్తుంది.
ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నికితా సింగ్ కాదు.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. వీడియోలో కనిపిస్తున్న మహిళ వైఎస్‌ఆర్‌సి పార్టీ నాయకురాలు విడదల రజినీ అని మేము కనుగొన్నాము. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు.
“ముస్లిం, మైనారిటీ లకు అండగా ఉన్నాం..ఉంటాం | Minister Vidadala Rajini Attends Iftar Party “ అనే టైటిల్ తో ఏప్రిల్ 9, 2024న యూట్యూబ్ లో ఈ వీడియో షేర్ చేశారని మేము కనుగొన్నాము. వైరల్ విజువల్స్ ను 54 సెకెండ్ల మార్క్ వద్ద మనం చూడొచ్చు.
“ముస్లిం,మైనారిటీ లకు అండగా ఉన్నాం..ఉంటాం. #ManathoManaRajinamma #YSRCongressPartyGunturWest #iftar అనే టైటిల్ తో వైరల్ వీడియోను మంత్రి విడదల రజినీ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు.
మేము నికితా సింగ్, ఛత్తీస్‌గఢ్ SDM కోసం వెతికగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఆ పేరుతో ఉన్న ఎవరి గురించిన వార్తా నివేదిక మాకు కనిపించలేదు. చత్తీస్‌గఢ్‌తో సంబంధం లేని ప్రభుత్వ అధికారులైన నికితా సింగ్ కు సంబంధించిన కొన్ని ప్రొఫైల్‌లను మాత్రమే మేము కనుగొన్నాము.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ వెబ్‌సైట్ లో కూడా నికితా సింగ్ అనే ఏ SDM గురించి ప్రస్తావన లేదు.
ఛత్తీస్‌గఢ్ SDM మసీదును సందర్శించినట్లు వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి అయిన విడదల రజిని.
Claim : వైరల్ వీడియోలో ఛత్తీస్‌గఢ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నికితా సింగ్ ఒక మసీదుకు భూమిని విరాళంగా ఇచ్చారు. అందులో జరిగిన నమాజ్‌కు కూడా హాజరయ్యారు
Claimed By : Social media users
Fact Check : False