ఫ్యాక్ట్ చెక్: కుర్ కురే పొడి ని కాల్చినప్పుడు అగ్నిపర్వతంలా మండుతుందా??

జంక్ ఫుడ్ తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి. ప్రాసెస్ చేయబడిన జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యాన్ని;

Update: 2025-01-03 06:54 GMT

Kurkure powder     

జంక్ ఫుడ్ తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి. ప్రాసెస్ చేయబడిన జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, వారిని ప్రీ-డయాబెటిక్, ఊబకాయులుగా చేస్తుంది. జంక్ ఫుడ్‌లో పోషక విలువలు చాలా తక్కువ ఉంటాయి. విపరీతమైన జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఎదిగే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలను కోల్పోతారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లల ప్రవర్తన కూడా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకాగ్రత కుదరకపోవడమే కాకుండా మానసిక రుగ్మతలు కూడా మొదలవుతాయన్నారు.

కుర్కురేను చాలా మంది తల్లిదండ్రులు అనారోగ్యకరమైన చిరుతిండిగా పరిగణించారు. ఇందులో అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కుర్కురేలో ప్లాస్టిక్ కూడా ఉందని పలు ఊహాగానాలు వచ్చాయి. “మీరు చూస్తుంది దీపావళి బాంబ్ కాదు. రోజూ మీరుతినే కుర్ కుర్ లు. మీ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో చూడండి. ప్లీజ్ అవి పెట్టకండి పిల్లలికి”. అంటూ ఓ కాషాయ రంగు పదార్ధం మండుతూ ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది. 

Full View

Full View

Full View
Full View

క్లెయిం ఆర్కైవ్ లింకు ఇక్కడ చూడొచ్చు. 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. వీడియోలో కుర్కురే పొడిని కాల్చడం లేదు.ఇది ఒక యూట్యూబ్ చానల్ షేర్ చేసిన సైన్స్ ప్రయోగాన్ని చూపిస్తోంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియోని sarveshtripathimaxscience అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.“Hands-on Science experiments..World's Best Experiments.. India's No.1 and Only Science Centre For Kids.. Contact: 9979976569 / 9574524836 

https://youtube.com/@sarveshtripathimaxscience?si=ekMh8pRTNG4dUQsW #science #steam #experiment #diy #kindergarten #elementary #primary #education #india #ahmedabad #surat #vadodara #mumbai #chemistry #lab #empower #curiosity #activities #earlychildhoodeducation” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ఈ పోస్ట్‌పై కామెంట్స్ ను తనిఖీ చేసినప్పుడు, ఈ ప్రయోగంలో ఉపయోగించింది అమ్మోనియం డైక్రోమేట్‌ అంటూ పేర్కొనడం మనం చూడొచ్చు. ఇది చాలా విషపూరితమైనది, క్యాన్సర్ కారకమైనదన్నారు. అస్సలు సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. 

Full View
Sarvesh Tripathi Max Science అనే యూట్యూబ్ ఛానల్ లో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను చూశాం. భారతదేశంలోని గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో పిల్లలకు సైన్స్ విద్య బోధించే సైన్స్ సెంటర్. ఈ యూట్యూబ్ చానల్ లో రకరకాల సాంకేతిక ప్రయోగాలు చేయడం కనిపిస్తుంది. 
Full View
మరింత పరిశోధన చేయగా, మేము అదే ప్రయోగాన్ని చూపుతున్న కొన్ని వీడియోలను కనుగొన్నాము. usch youtube వీడియోలో అమ్మోనియం డైక్రోమేట్ ప్రదర్శన చూడొచ్చు. 
Full View
దీన్ని క్యూగా ఉపయోగించి “అమ్మోనియం డైక్రోమేట్” అనే కీవర్డ్‌లను ఉపయోగించి శోధించినప్పుడు, ఫిబ్రవరి 2019లో అప్లోడ్ చేసిన మరో YouTube వీడియోను కూడా మేము కనుగొన్నాము. “With just some slight encouragement in the form of activation energy, Ammonium Dichromate can undergo a very exothermic and impressive decomposition reaction. Due to the production of gases in the reaction, and the lower density solid product formed, a "volcano" effect occurs and is always a crowd-pleaser” అనే డిస్క్రిప్షన్ ను మేము చూశాం. యాక్టివేషన్ ఎనర్జీ రూపంలో కొంచెం నిప్పు తగిలినా అమ్మోనియం డైక్రోమేట్ జరిగి భగ్గున మండిపోతుందని. వాయువుల ఉత్పత్తి, తక్కువ సాంద్రత కలిగిన ఘన ఉత్పత్తి కారణంగా "అగ్నిపర్వతం" లాంటి ప్రభావం ఏర్పడుతుందని వివరించారు. 
ఇలాంటి ప్రయోగాన్నే చూపించే మరిన్ని వీడియోలు మాకు యూట్యూబ్ లో లభించాయి. 
Full View
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఆరెంజ్‌ రంగు పౌడర్‌ను నిప్పంటించినప్పుడు, అగ్నిపర్వతంలా మండుతున్నట్లు కనిపిస్తున్నది కుర్కురే పౌడర్ కాదు. ఇది అమ్మోనియం డైక్రోమేట్. అమ్మోనియుం డైక్రోమేట్ సాంకేతిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు. ఇది అగ్నిపర్వత విస్పోటనం చూపే ప్రయోగాలలో ఉపయోగిస్తారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 
Claim :  కుర్కురే పౌడర్ కాల్చినప్పుడు ఊహించని విధంగా మండిపోయిందని వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Instagram Users
Fact Check :  False
Tags:    

Similar News