ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలోని ఆర్మూర్లో మనిషిని మింగేసిన ముసలి అంటూ వైరల్ అవుతున్న వీడియోల్లో ఎటువంటి నిజం లేదు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం భారతదేశంలోని అనేక ప్రాంతాలను తీవ్ర ప్రభావితం చేశాయి. పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం భారతదేశంలోని అనేక ప్రాంతాలను తీవ్ర ప్రభావితం చేశాయి. పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. వీధుల్లో నీటి ఎద్దడి, వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా సింహాలు, మొసళ్లు, కొండచిలువలు వంటి వన్యప్రాణులు వీధుల్లోకి వస్తున్నట్లు చూపించే కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి.
ఇంతలో, ఒక వ్యక్తి శరీరాన్ని మొసలి కొరికే వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లోని బారాటాంగ్‌లో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటూ 25 సెకన్ల నిడివి గల వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోకు “Andaman- Crocodile killed and ate half body of a local man at Baratang, Port Blair. #andaman.” అని కూడా చెప్పుకొచ్చారు.
https://www.youtube.com/shorts/zEOPUhNpdQg
https://www.youtube.com/ shorts/f5ZhwiZceBE
https://www.youtube.com/shorts/H_AKGpFEMfs
ఇదే వీడియో తెలంగాణలో చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “ఆర్మూర్లో మనిషిని మింగేసిన ముసలి” అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోకు “Andaman- Crocodile killed and ate half body of a local man at Baratang, Port Blair. #andaman.” అని కూడా చెప్పుకొచ్చారు.
https://www.youtube.com/
https://www.youtube.com/
https://www.youtube.com/
ఇదే వీడియో తెలంగాణలో చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “ఆర్మూర్లో మనిషిని మింగేసిన ముసలి” అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవల చోటు చేసుకున్నది కాదు. 2019, ఏప్రిల్ లో ఇండోనేషియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మేము వైరల్ వీడియోను Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆ వీడియో ఏప్రిల్ 2019లో Facebookలో “Killer Crocodile eats man for breakfast… Be safe these creatures are extremely dangerously smart” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారని మేము కనుగొన్నాము.

ఈ పోస్ట్ నుండి, మేము వీడియో లొకేషన్‌ను గుర్తించలేనప్పటికీ, వీడియో మొదటిసారి 2019లో పోస్ట్ చేశారని తెలుసుకున్నాం.
“Crocodile kills man 2019” అనే కీవర్డ్స్ తో వెతకగా.. ఏప్రిల్ 2019 లో పలు కథనాలను మేము కనుగొన్నాం.
అదే వీడియో www.newsflare.comలో ఏప్రిల్ 13, 2019న ప్రచురించారు. మొసలి ఓ వ్యక్తిని బలంగా పట్టుకుందని ఆ కథనం వివరిస్తుంది. అతడిని ఆ మొసలి హతమార్చిందని తెలిపారు.
డార్లిన్ ఉటి అనే 30 సంవత్సరాల వ్యక్తి.. ఏప్రిల్ 12, 2019న ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసిలోని తన ఇంటి సమీపంలో నీటి అడుగున పైపును బిగించడానికి నదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో మొసలి దాడి చేసింది.
నది ఒడ్డున ఉన్న డార్లిన్ సోదరి, అతనిని రక్షించడానికి ప్రయత్నించిందని.. అయితే మొసలి అతడిని నీటి లోకి లాక్కుని వెళ్లిపోయిందని డైలీస్టార్ కథనం పేర్కొంది.
బాధితుడి మృతదేహాన్ని గుర్తించడానికి చేసిన ప్రయత్నాల్ని, రెస్క్యూ బృందం చేసిన పనులను Mirror.co.uk ప్రచురించింది.
మొసలి ఒక వ్యక్తి శరీర భాగాలను కొరికే వీడియో ఇటీవల భారతదేశంలో చోటు చేసుకుంది కాదు. ఇండోనేషియాలో చోటు చేసుకున్నది. తప్పుడు వాదనలతో షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.

Claim : Viral video shows Crocodile killing a person in Andaman/Armoor
Claimed By : Youtube and Whatsapp users
Fact Check : False