ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలకు డబ్బులు పంచుతున్న వీడియో ఇటీవలిది కాదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు

Update: 2023-11-17 05:09 GMT

BRS meeting

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షోలను, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు.

BRS పార్టీ సభ్యులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రజలకు డబ్బులు ఇస్తున్నట్లు చూపించే వీడియో విభిన్న వాదనలతో వైరల్ అవుతోంది. BRS పార్టీ మీటింగ్ తర్వాత 300 రూపాయలు పంచుతున్నారంటూ.. Instagram వినియోగదారుడు వీడియోను షేర్ చేశారు.
"BRS పార్టీ మీటింగ్ తర్వాత ₹300 రూపాయల పంపిణీ..!! #ByeByeKCR’" అంటూ వీడియోను పోస్టు చేశారు.
'బంగారు తెలంగాణ కోసం డబ్బులు పంచితే తప్పేంటి' అని మరో యూజర్ కూడా వీడియోను షేర్ చేశారు.
Full View

ట్విట్టర్ లో “డబ్బులు చేతిలో పెడితే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జనం రారు మరి! #KCR #TSPolls #UANow”. అంటూ పోస్టులు పెట్టారు.
యూట్యూబ్‌లో కూడా అదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
Full View
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియో పాతది.. జనవరి 2020 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అక్టోబర్ 2020లో Facebookలో షేర్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.
Full View
మేము తెలుగు టీవీ ఛానెల్‌లు ప్రచురించిన YouTube వీడియోలను కూడా మా పరిశోధనలో కనుగొన్నాము. ఈ వీడియోను సివిఆర్ న్యూస్ తెలుగు షేర్ చేసింది “సత్తుపల్లిలో మున్సిపల్ ఎన్నికలకు డబ్బులు పంచుతున్న టీఆర్‌ఎస్ నేతలు | CVR News” అని జనవరి 21, 2020న వీడియోను అప్లోడ్ చేశారు. సత్తుపల్లిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాయకులు ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, బహుమతులు, డబ్బు పంపిణీ చేశారని యాంకర్ వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా సభ్యులపై నేతలు దాడి చేశారని కూడా తెలిపారు.
Full View
టీఆర్‌ఎస్ అభ్యర్థి అనీష్ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కినట్లు ఎన్టీవీ తెలుగు కూడా వీడియోను కూడా ప్రచురించింది. జనవరి 20, 2020న NTV ప్రచురించిన YouTube వీడియోను మీరు ఈ లింక్ లో చూడొచ్చు. “డబ్బులు పంచుతూ పట్టుబడ్డ టీఆర్ఎస్: TRS Candidates Distribute Money in Peddapalli & Sathupalli | NTV" అంటూ వీడియోను పోస్టు చేశారు. మున్సిపాలిటీకి చెందిన 7వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనీష్‌ క్యూలైన్‌లో నిల్చున్న వారికి డబ్బులు పంచారు.
Full View
అందువల్ల.. BRS పార్టీ సభ్యులు డబ్బు పంపిణీ చేస్తున్న వీడియో పాతది. 2020 సంవత్సరం సత్తుపల్లిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అప్పటి TRS సభ్యుడు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసిన సంఘటన ఇది. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.
Claim :  The video shows a recent incident of BRS party leaders paying voters to attend the party rallies and vote for the party.
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News