ఫ్యాక్ట్ చెక్: ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో పాకిస్థాన్ లో చోటు చేసుకున్న రైలు ప్రమాదం గా వైరల్ చేశారు
ఆదివారం దక్షిణ పాకిస్థాన్‌లో రైలు పట్టాలు తప్పిందన్న వార్త తెలియగానే, రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పట్టాలు తప్పిన బోగీల వీడియోను నెటిజన్లు పంచుకున్నారు. 30 మంది మృతి చెందారని పాక్ మీడియా తెలిపింది.

ఒక ట్విట్టర్ వినియోగదారుడు “కరాచీకి 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధ్‌లోని నవాబ్‌షా జిల్లాలోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో హజారా ఎక్స్‌ప్రెస్ 10 బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 30 మంది మరణించారు. 80 మందికి పైగా గాయపడ్డారు." అంటూ పోస్టు పెట్టాడు.
మరో ట్విట్టర్ వినియోగదారుడు “పాకిస్తాన్‌లోని నవాబ్‌షా నగరానికి సమీపంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 28 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు." అని చెప్పాడు.
మరో ట్విట్టర్ వినియోగదారుడు “పాకిస్తాన్‌లోని నవాబ్‌షా నగరానికి సమీపంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 28 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు." అని చెప్పాడు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ క్లిప్ లోగోలో ఒడిషా TV అని ఉండడం మేము గుర్తించాం. దీన్ని క్లూగా తీసుకుని ఇది ఒడిషా రైలు ప్రమాద ఘటనతో ముడిపడి ఉండవచ్చని తెలుస్తోంది. వైరల్ వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ జూన్ 2023 న ట్విట్టర్‌లో పోస్టు చేసిన పలు పోస్ట్‌లను గుర్తించాం. ఈ పోస్ట్‌లు జూన్ 2 న జరిగిన ఒడిశా రైలు విషాదాన్ని సూచిస్తాయి, బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఆ ప్రమాదంలో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అదే వీడియో షేర్ చేశారు.https://twitter.com/
https://twitter.com/
ఇది ఒడిశా రైలు దుర్ఘటన అని ధృవీకరిస్తూ పలు వార్తా సంస్థల్లో ఇలాంటి విజువల్స్ ఉండడాన్ని గమనించాం. హిందుస్థాన్ టైమ్స్ నివేదించిన ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రమాదం జరగడానికి నిమిషాల ముందు సిగ్నల్ ఇవ్వడానికి సంబంధించిన మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చు.
డ్రోన్ ఫుటేజీలో ఉన్నది ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనకు సంబంధించినవి. పాకిస్తాన్ రైలు ప్రమాదంతో ఎటువంటి సంబంధం లేదు. అందువలన, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : video shows footage of train derailment in Pakistan that took place on 5th August
Claimed By : Twitter Users
Fact Check : False