ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్లపైన సింహాలు సంచరించాయంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో సింహాలు కనిపించాయని కొందరు ప్రచారం చేశారు. ఓ వీధిలో సింహాలు సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో సింహాలు కనిపించాయని కొందరు ప్రచారం చేశారు. ఓ వీధిలో సింహాలు సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
“తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లాలో తూడుకుర్తి గ్రామంలో రాత్రి రోడ్లపై సంచరించిన సింహాలు. భయాందోళనలు స్థానికులు..” అంటూ పలువురు వీడియోను షేర్ చేశారు. ఓ వీధిలో సింహాల గుంపు కనిపించడాన్ని మనం చూడొచ్చు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో వీడియో వైరల్ అయ్యింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో చాలా పాతది.
మేము వైరల్ వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను సెర్చ్ చేయగా.. అదే వీడియో కొన్ని సంవత్సరాల నుండి చెలామణిలో ఉందని మేము కనుగొన్నాము..
Anil RK అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్టు చేశారు. “चाचरिया में 4 शेर घुमते नजर आ रहे हैं कृपया सतर्क रहै” అంటూ ఏప్రిల్ 2024లో పోస్టు చేశారు. చచారియా ప్రాంతంలో సింహాలు సంచరిస్తూ ఉన్నాయన్నది ఆ టైటిల్ ద్వారా తెలియజేయాలని చూశారు.
మరో యూట్యూబ్ యూజర్ కూడా డిసెంబర్ 9, 2023న ‘Boisar ma 5 tiger ka hamla #boisar #youtube #short #Tiger’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు.
మరో యూట్యూబ్ యూజర్ కూడా ఆగస్టు 2023లో వీడియోను షేర్ చేశారు.
2021 జనవరి 17న గోడి గ్రేటర్ నోయిడా అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని తూడుకుర్తి గ్రామానికి చెందినది కాదని మేము గుర్తించాం. మేము వీడియోను ఏ ప్రాంతంలో రికార్డు చేశారో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించలేకపోయినప్పటికీ.. వీడియో పాతదని, ఇటీవలిది కాదని మేము కనుగొన్నాం. వీడియో పాతది, 2021 నుండి అంతకంటే ముందే ఆన్‌లైన్‌లో ఉంది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని తూడుకుర్తి గ్రామంలో సింహాలు సంచరించలేదు.
Claim : నాగర్‌కర్నూల్ జిల్లాలోని తూడుకుర్తి అనే గ్రామంలో ఇటీవల కొన్ని సింహాలు వీధుల్లో సంచరించిన సంఘటనను వైరల్ వీడియో చూపిస్తుంది.
Claimed By : Social media users
Fact Check : False