ఫ్యాక్ట్ చెక్: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం వచ్చాక దళితులపై పోలీసులు దాడి చేయలేదు

మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఒక వ్యక్తి భారత రాజ్యాంగాన్ని అవమానించాడన్న ఆరోపణల కారణంగా హింస చెలరేగింది. పర్భాని

Update: 2024-12-13 05:11 GMT

Parbhani Maharashtra

మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఒక వ్యక్తి భారత రాజ్యాంగాన్ని అవమానించాడన్న కారణంగా హింస చెలరేగింది. పర్భాని గ్రామంలోని ముర్తిజాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గాజు పెట్టెలో ఉంచిన రాజ్యాంగ సిమెంట్ ప్రతిరూపాన్ని ధ్వంసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో హింసాత్మక నిరసనలకు దారితీసింది. అక్కడ వందలాది మంది నిరసనకారులు కలెక్టర్ కార్యాలయం వెలుపలకు చేరుకున్నారు. ఆ తర్వాత భవనంలోకి చొరబడి, ఫర్నిచర్, కిటికీలను ధ్వంసం చేశారు.

ఈ సంఘటన తరువాత, మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం దళితులను లక్ష్యంగా చేసుకుని వారిని వేధిస్తోందనే వాదనతో పోలీసు ఒక వ్యక్తిని వెంబడించి కర్రతో కొట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. “Peshwa rule has been established in Maharashtra, Dalits are being chased and beaten mercilessly.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పేష్వా రూల్ మొదలైందని, దళితులను అత్యంత దారుణంగా కొడుతున్నారని పోస్టుల్లో ఆరోపించారు.

క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. నిరసనకారులు నిప్పుపెట్టి కలెక్టర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వందలాది మంది ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయం వెలుపల గుమిగూడారు, వారిలో కొందరు భవనంలోకి చొరబడి ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిస్థితిని అంచనా వేయడానికి స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
పెద్ద ఎత్తున మూక హింస, వస్తువుల దహనం, రాళ్లదాడి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జీ న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు అనేక CCTVలను కూడా ధ్వంసం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు.
వికృత గుంపులను నియంత్రించాలని పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అనేక ప్రాంతాల్లో మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి నిరసనకారుల సమూహాలను పోలీసులు వెంబడించారు. ముందుజాగ్రత్తగా, ప్రజలు పుకార్లని నమ్మొద్దని, ప్రశాంతంగా ఉండాలని, నగరంలో ఇంటర్నెట్‌ను కూడా బ్యాన్ చేయాలని సూచించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో, చుట్టుపక్కల పలు ప్రదేశాలలో సాయుధ పోలీసులు, ఇతర బలగాల మోహరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో భద్రతను కూడా పెంచారు.
VIDEO | Maharashtra: Violence in Parbhani during a bandh called in the city. An unidentified person on Tuesday damaged a replica of the Constitution held by the statue of B R Ambedkar outside Parbhani railway station triggering arson and stone-pelting. #Parbhani #MaharashtraNews అనే క్యాప్షన్ తో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మూక హింసకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అందులో కూడా రాజ్యాంగ ప్రతిమను ధ్వంసం చేశారనే వార్తల కారణంగా హింస చెలరేగింది తెలిపారు.
పోలీసు ఒక వ్యక్తిని వెంబడించి కొట్టడాన్ని చూపించే వీడియో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై హింసను చూపించలేదు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై హింస జరుగుతోంది
Claimed By :  X (Twitter) users
Fact Check :  Misleading
Tags:    

Similar News