ఫ్యాక్ట్ చెక్: ప్రేక్షకులను సవాలు చేస్తున్న మహిళా రెజ్లర్ పాకిస్తానీ కాదు, వీడియో పాతది
ఒక మహిళా రెజ్లర్ తనతో పోరాడమని ప్రేక్షకులను సవాలు విసురుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆమె అలా సవాలు విసిరిన తరువాత సల్వార్ కమీజ్ ధరించిన ఒక మహిళ ప్రేక్షకుల నుంచి లేచి బరిలోకి దిగి ఆమెను ఓడించింది.
ఒక మహిళా రెజ్లర్ తనతో పోరాడమని ప్రేక్షకులను సవాలు విసురుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆమె అలా సవాలు విసిరిన తరువాత సల్వార్ కమీజ్ ధరించిన ఒక మహిళ ప్రేక్షకుల నుంచి లేచి బరిలోకి దిగి ఆమెను ఓడించింది.
రింగ్‌లో ఉన్న యోధురాలు పాకిస్థానీ రెజ్లర్ అని, భారత్‌లోని వ్యక్తులను ఆమెతో పోరాడి ఓడించమని కోరిన వీడియో వైరల్‌గా మారింది. అప్పుడు తమిళనాడుకు చెందిన ఒక మహిళ ఆమెను ఓడించింది.
క్లెయిం తెలుగులో ఇలా ఉంది “*దుబాయ్‌లో జరిగిన మహిళల రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాకిస్థాన్ మహిళా రెజ్లర్ విజేతగా నిలిచింది. భారతీయ మహిళలను ఎగతాళి చేస్తూ, తనతో పోటీగా భారతీయ మహిళ ఎవరైనా వస్తారా అని వేదికపైకి సవాల్ విసిరారు. తమిళనాడుకు చెందిన కవిత విజయలక్ష్మి* అనే భారతీయ యువతి అకస్మాత్తుగా తాను సిద్ధంగా ఉన్నానని చేతులెత్తేసింది. చాముండ రూపాన్ని ధరించి, కుంకుమ ధరించి వేదికపై కనిపించిన ఆమె, ఆ తర్వాత పాకిస్థానీ రెజ్లర్‌ను రెండుసార్లు ఓడించి విజయం సాధించింది. చూసి ఆనందించండి. మన దేశాన్ని అవమానించే వారందరి గతి ఇదే అవుతుంది. *”
ఈ వాదన యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.
నిజ నిర్ధారణ:
వాదన అవాస్తవం. మహిళలు ఇద్దరూ భారతీయులు, వీడియో 2016 సంవత్సరానికి సంబంధించిన పాత సంఘటనను చూపుతుంది.
జాగ్రత్తగా గమనించినప్పుడు, వీడియోలో కనిపించే బ్యానర్‌లలో g8cwe.com ని చూడగలిగాము. కానీ ఆ వెబ్ సైట్ మాకు లభించలేదు. CWE కోసం శోధించినప్పుడు, మేము khalicwe.com అనే వెబ్‌సైట్ లభించింది, ఇది CWE అనే కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (CWE), భారతదేశపు ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్ ట్రైనింగ్ అకాడమీ అని దాని వివరణలో చూడవచ్చు. ఇది ఇండియన్-అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ అకా ది గ్రేట్ ఖలీ స్థాపించింది. CWE ని మాజీ WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది గ్రేట్ ఖలీ జనవరి 20, 2015న స్థాపించారు.
CWE ఇండియా యూట్యూబ్ ఛానెల్‌ని సెర్చ్ చేసినప్పుడు, కుస్తీకి సంబంధించిన అనేక వీడియోలు లభించాయి. బిబి బుల్ బుల్ ఓపెన్ ఛాలెంజ్‌ని కవిత స్వీకరించింది అనే శీర్షికతో 2016 జూన్ 13న వీడియోను ఛానెల్ పోస్ట్ చేసింది.
ఈ సూచనను తీసుకొని, మేము “కవిత + BB బుల్ బుల్” అనే కీవర్డ్‌లను ఉపయోగించి శోధించినప్పుడు,DNA India.com లో ప్రచురించబడిన ఒక కథనం లభించింది. భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ మహిళా రెజ్లర్, B B బుల్ బుల్ ను మాజీ MMA ఛాంపియన్ పడగొట్టింది.
భారతదేశానికి చెందిన మొదటి ప్రొఫెషనల్ మహిళా రెజ్లర్ అయిన BB బుల్ బుల్, జలంధర్‌లోని కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (CWE) హబ్‌లో జరిగిన ద్వంద్వ పోరాటంలో హర్యాణా మాజీ పోలీసు అధికారి, పవర్-లిఫ్టింగ్ MMA ఛాంపియన్ కవిత చేతిలో ఓడిపోయింది.
బుల్ బుల్ అరేనా వద్ద గుమిగూడిన ప్రేక్షకులను తనతో పోరాడమని సవాలు చేస్తూ కనిపిస్తుంది, కవిత ఆ సవాలును స్వీకరించి బరిలోకి దిగింది. బుల్ బుల్ కవితను చెంపదెబ్బ కొట్టడం ద్వారా ముందుకు సాగుతుంది, అయితే మాజీ పోలీసు అధికారి అనుభవజ్ఞురాలైన రెజ్లర్‌ను పడగొట్టింది.
రెజ్లర్ కవిత వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా హర్యాణాకు చెందినది, తమిళనాడుకు కాదు.
వైరల్ వీడియోను 7 సంవత్సరాల క్రితం డైలీమోషన్‌లో తెలుగు టీవీ ఛాన్సెల్ ఆభ్ణ్ 2016లో భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ మహిళా రెజ్లర్, BB బుల్ బుల్‌ను మాజీ MMA ఛాంపియన్ కవిత పడగొట్టారు అనే టైటిల్ తో షేర్ చేసింది,.
ఈ క్లెయిం కొన్ని సంవత్సరాల క్రితం ఆంగ్లంలో వైరల్ అవుతూ ఉంది, కొన్నేళ్లుగా ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తప్పు అని దృవీకరించారు.
కాబట్టి, వీడియో 2016లో జరిగిన ఒక రెజ్లింగ్ ఈవెంట్‌ను చూపుతోంది. ఇందులో ఇద్దరు భారతీయ మహిళా రెజ్లర్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు కానీ పాకిస్తానీ, భారత రెజ్లర్లు కాదు. వీడియో ఇటీవలిది కాదు.