ఫ్యాక్ట్ చెక్: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని చైనాలోని టియాంజిన్‌లో ప్రారంభించారు.. అయితే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టలేదు

అక్టోబర్ 14, 2023న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరిట డాక్టర్ B R అంబేద్కర్ కు చెందిన 19 అడుగుల ఎత్తైన విగ్రహం ఆవిష్కరించారు. ఈ విగ్రహం మేరీల్యాండ్‌లోని అకోకీక్‌లోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC)లో భాగంగా ఉంది. భారతదేశం వెలుపల ఏర్పాటు చేసిన అంబేద్కర్ కు చెందిన అతిపెద్ద విగ్రహం.

Update: 2023-12-24 06:44 GMT

Tianjin Benhai Library

అక్టోబర్ 14, 2023న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరిట డాక్టర్ B R అంబేద్కర్ కు చెందిన 19 అడుగుల ఎత్తైన విగ్రహం ఆవిష్కరించారు. ఈ విగ్రహం మేరీల్యాండ్‌లోని అకోకీక్‌లోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC)లో భాగంగా ఉంది. భారతదేశం వెలుపల ఏర్పాటు చేసిన అంబేద్కర్ కు చెందిన అతిపెద్ద విగ్రహం.

భారత రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు మీద అమెరికాలో లైబ్రరీని నిర్మించారని.. అది ప్రపంచంలోనే అతి పెద్దదని చెబుతూ కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

“भारत देश के मशिहा Dr. भीम राव अम्बेदकर जी के नाम अमेरिका ने खोला विश्व का सबसे बडा पुस्तकालय!! शर्म करो मेरे देश के गद्दारों जिस इंसान की तुम मूर्तिया तोड़ते हो उसकी विदेश में कितनी इज्जत है!! जय भीम जय भारत जय संविधान धम्म प्रभात" అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.

"భారతదేశానికి చెందిన ఐకాన్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరు మీద USAలో ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ప్రారంభించారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం, కూల్చివేయడంలో కొందరు దేశ ద్రోహులు పాల్గొంటున్నారు. అయితే అదే వ్యక్తిని పరాయి దేశంలో గౌరవిస్తున్నందుకు సిగ్గుపడాలి. జై భీమ్. జై భారత్." అని ఆ పోస్టుల ద్వారా వివరించారు.

Full View

Full View

Full View



ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టుల్లోని చిత్రాలు USA కు చెందినవి కావు. చైనాలోని లైబ్రరీకి సంబంధించినవి. ఆ గ్రంథాలయానికి డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టలేదు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని DR B.R. అంబేద్కర్ లైబ్రరీ అంటూ సెర్చ్ చేయగా.. మాకు భారతదేశం వెలుపల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణం గురించి తెలిసింది. అమెరికా లోని మేరీల్యాండ్‌లో ఉన్న అకోకీక్‌లోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC) వద్ద నిర్మించిన అంబేద్కర్ విగ్రహం తప్ప ఇతర వివరాలు మాకు కనిపించలేదు.

మేము Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి చిత్రాల గురించి సెర్చ్ చేయగా.. అదే చిత్రాలు ఉన్న కొన్ని కథనాలను మేము కనుగొన్నాము.
india.com ప్రకారం, నవంబర్ 2017లో చైనీస్ పోర్ట్ సిటీ టియాంజిన్ టియాంజిన్ బిన్హై లైబ్రరీ ప్రారంభోత్సవానికి సంబంధించిన సమాచారం దొరికింది. దీనిని డచ్ కంపెనీ MVRDV, టియాంజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌ స్టార్‌కిటెక్ట్ సమన్వయంతో నిర్మించారు. టియాంజిన్ బిన్‌హై లైబ్రరీలో 1.2 మిలియన్ల పుస్తకాలను కలిగి ఉంటుంది.

Business Insider యూట్యూబ్ ఛానెల్‌లో మార్చి 10, 2018న అప్లోడ్ చేసిన వీడియోలో టియాంజిన్ బిన్‌హై లైబ్రరీని చూపుతుంది. ఈ లైబ్రరీ పుస్తక ప్రియులకు ఓ స్వర్గం లాంటిదని వీడియో వివరణలో పేర్కొన్నారు. ఈ లైబ్రరీ 33,700 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది, 1.2 మిలియన్ పుస్తకాలు ఉన్నాయి. డచ్ ఆర్కిటెక్చర్ సంస్థ MVRDV, టియాంజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌ దీనిని పూర్తి చేశారు. దీనికి "ది ఐ" అని పేరు పెట్టారు.

ఈ లైబ్రరీ ఆకృతి కంటి రూపంలో ఉండడంతో ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. లైబ్రరీ మధ్యలో ఒక పెద్ద భూగోళం ఉంది. దాని లోపల ఆడిటోరియం ఉంది. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకంగా చాలా పుస్తకాలకు తెప్పించారు. ఆర్కిటెక్చర్ విషయంలో కూడా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. పిల్లలకు, విద్యకు అంకితమైన విభాగాలు ఉన్నాయి. లైబ్రరీ 2017లో ప్రారంభమైనప్పటి నుండి ఇటీవలి కాలంలో పర్యాటకులకు హాట్ స్పాట్‌గా మారింది. మంచి ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి కూడా మంచి ప్లేస్ గా పేరు తెచ్చుకుంది.

Full View

MVRDV వెబ్‌సైట్ లో ఇందుకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

వైరల్ చిత్రాలు చైనాలోని టియాంజిన్‌లోని లైబ్రరీకి చెందినవి. ఈ లైబ్రరీ అమెరికాలో లేదు. ఇక ఏ విధంగానూ డీఆర్‌బీఆర్‌ అంబేద్కర్‌కు సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  The viral image shows the world’s largest library in the name of Dr. B. R. Ambedkar, opened in the United States of America.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News