మరోసారి చర్చనీయాంశంగా మారిన బాంబే బ్లడ్ గ్రూప్

సాధారణంగా మనుషుల్లో బ్లడ్ గ్రూపులు ఏ, బి, ఓ

Update: 2024-01-18 12:08 GMT

సాధారణంగా మనుషుల్లో బ్లడ్ గ్రూపులు ఏ, బి, ఓ... లలో పాజిటివ్ లేదా నెగిటివ్ అయి ఉంటుంది. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాస్త అరుదైనది. అన్నింటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ ‘బాంబే బ్లడ్ గ్రూప్’ అని అంటుంటారు. మన దేశంలో 179 మంది మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్నారు. ప్రపంచంలో పదిలక్షల మందిలో నలుగురికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూపు ఉంది.

తాజాగా బాంబే గ్రూప్ రక్తాన్ని అందించిన తెలంగాణ యువకుడు ఓ తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని మహిళకు రక్తం అవసరం అయింది. మొగల్తూరు మండలానికి చెందిన సుమకు పురిటినొప్పులు రావడంతో నరసాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డెలివరీ చేయాల్సి రావడంతో.. పరీక్షల్లో ఆమెది అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ అని తేలింది. దీంతో దాతల కోసం ఆన్లైన్లో వెతికారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో నరసాపురం రెడ్ క్రాస్ ను సంప్రదించారు. అక్కడి సిబ్బంది అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ గురించి స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ విప్ ముదునూరికి వివరించి ప్రభుత్వం ద్వారా దాతల వివరాలు సేకరించాలని కోరారు. ఇదే బ్లడ్ గ్రూప్ కలిగిన తెలంగాణ వ్యక్తికి సంబంధించిన సమాచారం లభించడంతో.. ఆయన రక్తం ఇచ్చేందుకు అంగీకరించారు. కారులో నరసాపురం వచ్చి రక్తదానం చేశారు. ఇంతకూ ఆ బ్లడ్ గ్రూప్ కు బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? 1952లో బాంబే (ముంబై) నగరంలో ఈ బ్లడ్ గ్రూప్‌ను తొలిసారి గుర్తించారు. దీంతో ఈ బ్లడ్ గ్రూప్‌కు ఆ నగరం పేరిట బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరొచ్చింది.
ఈ రక్తం ఉన్న వారి కోసం ఒక సంస్థ ప్రత్యేకంగా పని చేస్తూ ఉంది. BombayBloodGroup.Org వెబ్ సైట్లో ఈ బ్లడ్ గ్రూప్ రక్తం కలిగి ఉన్నవారు తమ వివారాలను నమోదు చేసుకోవాలి. దీని వల్ల వారికి అవసరం అయినప్పుడు అందులోని దాత ద్వారా రక్తాన్ని పొందవచ్చు, అలాగే దానం కూడా చేయవచ్చు. ఈ రక్తాన్ని సేకరించాక ఏడాది పాటూ సురక్షితంగా నిల్వ ఉంచుతారు.


Tags:    

Similar News