వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా?

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టకు చాలా మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో పెరుగు కీలక పాత్రర

Update: 2024-07-12 11:31 GMT

curd

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టకు చాలా మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో పెరుగు కీలక పాత్రర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అందువల్ల పాలు ఇష్టపడని వారు పెరుగును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, వర్షాకాలంలో రోజుకు రెండుసార్లు 200 గ్రాముల పెరుగు తింటే మలబద్ధకం సమస్యలు ఉండని, వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు.

డయోరియా అరికట్టవచ్చు

పెరుగు తినడం వల్ల డయోరియాను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పెరుగును ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పెరుగు తినకూడదని సూచిస్తున్నారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోలంటున్నారు.

రాత్రిపూట పెరుగు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని కాబట్టి రాత్రిపూట పెరుగు కాకుండా మజ్జిగ, రైతా రూపంలో తీసుకుంటే మంచిదంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే వారిని సంప్రదించాలని సూచిస్తున్నాము.)

Similar News