Custard Apple : సీతాఫలం జుర్రేయవచ్చు.. వాళ్లు వీళ్లు కాదు... అందరూ.. వైద్యులు ఏం బెబుతున్నారంటే?

ప్రస్తుతం సీతాఫలం సీజన్ నడుస్తుంది. దీని రుచి ఒకసారి చూసిన వారు ఒక వదిలిపెట్టరు

Update: 2024-10-25 11:41 GMT

ప్రతి సీజన్ లో వచ్చే పండ్లను రుచి చూడటమే మంచిది. ఎందుకంటే అందులో అన్ని రకాలైన పోషకాలు లభ్యమవుతాయి. ప్రస్తుతం సీతాఫలం సీజన్ నడుస్తుంది. దీని రుచి ఒకసారి చూసిన వారు ఒక వదిలిపెట్టరు. తీపిగా ఉండే ఈ మధరు ఫలం ఎన్ని పోషకాలను అందిస్తుందో వైద్యులు పదే పదే చెబుతారు. ఇప్పడు హైదరాబాద్ నగరంలో సీతాఫలం ఎక్కడ చూసినా లభ్యమవుతుంది. అందుబాటు ధరల్లో సీతాఫలాలు దొరుకుతున్నాయి. సో.. ఖచ్చితంగా దీనిని తిని దాని రుచి ఆస్వాదించాల్సిందే. అందులో తెలంగాణ అంటేనే సీతాఫలానికి పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ పంట పండుతుంది. ఎక్కువగా దీనిని ఈ ప్రాంతంలోనే సాగు చేస్తారు.

శరీరానికి అవసరమయ్యే...
సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. మన శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లూ పీచూ ఖనిజాలూ విటమిన్లూ పిండిపదార్థాలూ కొద్దిపాళ్లలో కొవ్వులూ అన్ని పోషకాలూ ఈ సీతాఫలంలో లభ్యమవుతాయి. అయితే సీతాఫలంలో గింజలు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన పండ్లకంటే గింజలు ఎక్కువగా ఉన్న పండ్లు సీతాఫలమే. దీనిని ఎవరు తినొచ్చు అనే సందేహాలు కూడా ఉన్నాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు సీతాఫలం తినొచ్చా? అన్న ప్రశ్నకు వైద్యులు ఏం చెబుతున్నారంటే... లక్షణంగా తినొచ్చు. కానీ తగిన మోతాదులో తినడం మంచిదని సూచిస్తున్నారు. ఇందులో పోషకాలు ఉండటంతో లక్షణంగా ఎవరైనా సీతాఫలాన్ని నిరభ్యరంతరంగా తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని, ఎవరైనా లక్షణంగా ఈ ఫ్రూట్ ను తగినంత మోతాదులో తినొచ్చని చెబుతున్నారు.
వైద్యులు ఏమంటున్నారంటే?
సీతాఫలాన్ని ఔషధ ఫలం అని కూడా పిలుస్తారు. సీతాఫలం పండ్లనే కాదు చెట్ల ఆకులు తిన్నా మంచిదేనని చెబుతారు. పండ్లలో రారాజు మామిడి పండు అయితే మహారాణి సీతాఫలం అని చెప్పొచ్చన్న ఛలోక్తులు కూడా వినిపిస్తాయి. సీజన్ లో లభించే ఈ ఫ్రూట్ ను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేయొచ్చు. సీతాఫలంలో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కణజాల బలహీనతనూ, అస్తమాను తగ్గిస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. జీర్ణం కూడా ఈ పండు తింటే సులువుగా అవుతుందని చెబుతున్నారు. సి విటమిన్ ఉండే ఈ ఫలాన్ని ప్రతి ఒక్కరూ తినొచ్చు. మూత్ర పిండాల వ్యాధులు రాకుండా కూడా ఈ ఫలం కాపాడుతుందని చెబుతున్నారు. ఇన్ని లక్షణాలున్న సీతాఫలాన్ని రుచి చూడటానికి ఇక తొందరెందుకు? రోడ్లపై సిద్ధంగా ఉన్నాయి. తెచ్చేసుకోండి.


Tags:    

Similar News