గుండె సమస్యలున్నవారు రోజుకు ఎంత నీరు తాగాలి? వైద్యులు ఏమంటున్నారు?
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తగినంత నీరు తాగాలి. కొందరు వ్యక్తులు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని సిఫార్సు ..
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తగినంత నీరు తాగాలి. కొందరు వ్యక్తులు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని సిఫార్సు చేస్తారు. మరికొందరు రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలని సిఫార్సు చేస్తారు. కానీ గుండె సంబంధిత రోగులు మాత్రం నీళ్లు తక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ ముఖేష్ గోయల్, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది హృద్రోగులు నీటిని తీసుకోవడం గురించి జాగ్రత్త వహించాలని చెప్పారు. అదే సమయంలో, బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ హరన్‌హల్లి ప్రకారం, కొన్ని పరిస్థితులలో, కార్డియాక్ పేషెంట్లు ఎక్కువ నీరు తాగవద్దని సూచిస్తుంటారు.
మూత్రపిండాలపై ఒత్తిడి
హృద్రోగులు తరచుగా సోడియం, పొటాషియంతో సహా ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ ముఖేష్ గోయల్ చెప్పారు. కొన్నిసార్లు ఎక్కువ నీరు తాగడం ఎలక్ట్రోలైట్ స్థాయిని పాడు చేస్తుంది. అదే సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా కిడ్నీ సరిగా పనిచేయని పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు.
అదే సమయంలో డాక్టర్ ప్రదీప్ హర్నహళ్లి మాట్లాడుతూ, గుండె పంపింగ్ పని నీటిని తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందంటున్నారు. తక్కువ నీరు తాగాలనే నిబంధన హృద్రోగులందరికీ వర్తించదని కూడా చెబుతున్నారు డాక్టర్ ప్రదీప్. కొన్నిసార్లు ఎక్కువ నీరు తాగడం వల్ల నడిచేటప్పుడు లేదా పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ నీరు తాగడం వల్ల గుండె పంపింగ్ విషయంలో కష్టతరం అవుతుందంటున్నారు. గుండెను ఓవర్‌లోడ్ చేయకుండా ఉండటానికి ఈ పరిమితి పాటించడం చాలా ముఖ్యమంటున్నారు. అతిగా తాగడం వల్ల శరీరంలో అదనపు ద్రవాలు పేరుకుపోతాయి.
ఎంత నీరు తాగాలి
గుండెపోటు రోగులు రోజుకు ఒకటిన్నర లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగకూడదని డాక్టర్ ప్రదీప్ హర్నహళ్లి చెబుతున్నారు. అదే సమయంలో హృద్రోగులు వేసవి కాలంలో 2 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగకూడదు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.