ఇది తెలిస్తే ఇకపై టాయ్ లెట్ లో ఎక్కువ సేపు కూర్చోరు
కొందరు టాయ్ లెట్ కు వెళ్లి ఎంతసేపైనా బయటకు రారు
కొందరు టాయ్ లెట్ కు వెళ్లి ఎంతసేపైనా బయటకు రారు. ఇక సెల్ ఫోన్ ను కూడా తమతో పాటూ తీసుకుని వెళ్తే ఎందుకు వెళ్ళామో కూడా మరచిపోయి స్క్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సమయంలో టాయ్ లెట్ లో కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని, టాయిలెట్ లో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్స్ మరియు కటి కండరాలు బలహీనపడటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌లో కొలొరెక్టల్ సర్జన్ అయిన డాక్టర్ లై జుయే, బాత్రూమ్ సంబంధిత ఆరోగ్య ఫిర్యాదులతో బాధపడుతున్న రోగులను నిశితంగా పరిశీలించారు. టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల అనారోగ్యానికి ఎక్కువ మంది గురవుతున్నారని డాక్టర్ జు CNN కి చెప్పారు.
టాయిలెట్‌పై కూర్చునే స్థానం శరీరానికి ఇబ్బందిని కలిగిస్తుందన్నారు.గుండెకు రక్తాన్ని పంప్ చేయడాన్ని కూడా కష్టతరం చేస్తుందన్నారు. టాయిలెట్ కు సంబంధించిన ఓవల్-ఆకారపు సీటు పురీషనాళాన్ని సాధారణ కుర్చీలో కంటే తక్కువ స్థానంలో ఉంచుతుందని అప్పుడే మల భాగంలో సమస్యలు తెలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా పేగులో కొంత భాగం జారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.