Breaking : మోహన్ బాబు మీడియాకు ఆడియో సందేశం
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు మీడియాకు ఆడియో సందేశం విడుదల చేశారు
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు మీడియాకు ఆడియో సందేశం విడుదల చేశారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అనిఆయన ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని మోహన్ బాబు ఆ సందేశంలో కోరారు. మీడియాపై దాడి చేస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని ఆయన తెలిపారు. దాడి చేయడం తన తప్పేనని, తనను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. జరిగిన ఘటననకు బాధపడుతున్నానన్న మోహన్ బాబు తనకన్నుకు మైక్ తగలబోయిందని, దానిని తప్పించుకున్నానని తెలిపారు.
దండం పెట్టి చెబుతున్నా...
నటులు, రాజకీయ నాయకుల విషయాలు ఉన్నవి ఉన్నట్లు లేనవి ఉన్నట్లు చెబుతుంటారన్నారు. కానీ అందరూ సైలెంట్ గానే ఉన్నారు. విజువల్స్ చూడాలని, రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ ఇంట్లోకి వచ్చాడని, అది రైటా? రాంగా? చెప్పాలన్నారు. పత్రికా విలేకర్లు నాలుగు రోజుల నుంచి తన ఇంటి ముందు లైవ్ వ్యాన్ లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ సబని ఆయన ప్రశ్నించారు. తానుదండంపెట్టి చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా తాను క్లీన్ చిట్ గా ఉన్నానని అన్నారు. తన హృదయంలో ఆవేదన చెప్పాలన్నారు. వచ్చిన వాళ్లు మీడియా వాళ్లా? వేరే వాళ్లా తెలియదని అని అన్నారు.