Hyderabad : గేటెడ్ కమ్యునిటీలకు ఆదరణ కరువు.. వాటికే డిమాండ్ అట

హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యునిటి కంటే తక్కువ ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి

Update: 2024-10-23 07:13 GMT

gated communities in hyderabad

హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యునిటీని ప్రజలు కోరుకుంటున్నారా? లేక తక్కువ సంఖ్యలో ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ ఉన్న వాటినే ఎంచుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రెండోదానిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గేటెడ్ కమ్యునిటీలో ఫ్లాట్స్ కొనుగోలు చేయాలంటే హైదరాబాద్ నగరానికి కొంత దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు అపార్ట్‌మెంట్స్ లో ఫ్లాట్స్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. వారి వారసులందరూ విదేశాల్లో స్థిరపడటం, తాము ఇక్కడే ఉండి పోవడంతో కొంత ఫ్లాట్స్ అయితే భద్రత ఉంటుందని నమ్ముతున్నారు. సెక్యూరిటీ పరంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఫ్లాట్స్ బెటర్ అని నమ్ముతున్నారు. అయితే నెలవారీ నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండటంతో గేటెడ్ కమ్యునిటీలో ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు.

ఇండిపెండెంట్ హౌస్‌‌లంటే...?
ఇండిపెండెంట్ హౌస్‌లకు ఎక్కువ సొమ్ము పెట్టి వెచ్చించే అవకాశమున్నప్పటికీ వాటి జోలికి పోవడం లేదు. కొంత బెరుకు.. మరికొంత భయం వారిని వెంటాడుతుంది. సీనియర్ సిటిజన్లుగా ఇద్దరు భార్యాభర్తలే ఇండిపెండెంట్ హౌస్‌‌లో ఉండటానికి ఇష‌్టపడటం లేదు. ఇద్దరే ఉన్న దంపతులను టార్గెట్ గా చేసుకుని కొన్ని ముఠాలు నగరంలో చెలరేగిపోతుండటం, బంగారు ఆభరణాలు, డబ్బులు కోసం హత్యల వరకూ తెగబడటం వంటివి చూసి సెక్యూరిటీ పరంగా కొంత అపార్ట్‌మెంట్ వైపు మొగ్గుచూపుతున్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా ఇలాంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్స్ హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
తక్కువ ఫ్లాట్లు ఉంటే...
తక్కువ ఫ్లాట్లు ఉంటే తాగు నీటి సమస్య రాదు. డ్రైనేజీ సమస్య తొందరగా తలెత్తదు. దీంతో పాటు ఉన్న పది మంది ఫ్లాట్ వాసులు కలివిడిగా ఉంటారు. ఎవరికి వారే అన్నట్లు అంటీముట్టనట్లు తలుపులు వేసుకుని ఉండరు. ఉదయం, సాయంత్రం వేళలలో పెద్దలతో బాతాఖానీ చెయొచ్చు. మహిళలు కూడా ఒక్కటిగా అన్ని పండగలు చేసుకునే సంప్రదాయం తక్కువ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్లలోనే జరుగుతుంది. కారు పార్కింగ్ సమస్య కూడా పెద్దగా ఉండదు. కారును బయటకు తీయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అదే గేటెట్ కమ్యునిటీలో వందల సంఖ్యలో ఫ్లాట్స్ ఉంటే ఎవరు ఏ ఫ్లాట్ లో ఉన్నారో పక్క వారికి కూడా తెలియదు. బయట నుంచి వచ్చి తలుపు వేసుకున్నారంటే బయటకు రారు. ఆదివారాలు కూడా తలుపులు బిగించుకుని ఇంట్లోనే మగ్గిపోతుంటారు. దీంతో హైదరాబాద్ లో ఐదు చదరపు గజాల్లో నిర్మించిన పది నుంచి పన్నెండు ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో గేటెడ్ కమ్యునిటీ ఫ్లాట్స్ లో కావల్సినన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి.


Tags:    

Similar News